తారక్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కమెడియన్ ప్రియదర్శి

పెళ్లి చూపులు సినిమాలో “నా చావు నే చస్తా.. నీకెందుకు” .. అనే డైలాగ్ తో నవ్వించిన ప్రియదర్శి… వరుసగా ఆఫర్లు అందుకున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలోను అలరించారు. జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్నేహితుడిగా నటించారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి చేస్తున్న మల్టీస్టారర్ మూవీలో మంచి రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు.

“జై లవ కుశ’లో ఎన్టీఆర్ మూడు పాత్రలను చేశారు. ఒక పాత్రకి మరో పాత్రకి మధ్య ఎక్కడా పోలిక ఉండదు. అయినప్పటికీ ఆయన డైలాగ్స్ ను గానీ .. డాన్స్ ను గాని ఎక్కువగా ప్రాక్టీస్ చేయరని ఈ సినిమా షూటింగు సమయంలో తెలుసుకున్నాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకసారి చూసుకుని కెమెరా ముందుకు వచ్చి టక్కున చెప్పేయడాన్ని కళ్లారా చూసాను. అప్పుడు ఇంతటి జ్ఞాపక శక్తి కలిగిన ఆర్టిస్టులు కూడా ఉంటారా? అని నేను ఆశ్చర్యపోయాను. సీన్ చేస్తున్నప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తారు. అవతల ఆర్టిస్టును ఎంకరేజ్ చేస్తారు” అని వివరించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus