‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే డైలాగుతో పాపులర్ అవడమే కాక.. ఆ డైలాగునే తన పేరు మొదట పెట్టుకున్నాడు. తెరమీద తన మార్క్క కామెడీతో ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేసే పృథ్వీ హీరోగానూ నటించాడు. తన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే పృథ్వీ.. SVBC బోర్డ్ ఛైర్మన్ పదవిలోనూ కొన్నాళ్లపాటు కొనసాగాడు.. అయితే ఓ ఆడియో లీక్ వివాదంలో చిక్కుకోవడంతో.. ఆ పదవికి రాజీనామా చేసేశాడు.. తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాడు. ఈమధ్య బయట పెద్దగా కనిపించడం లేదు..
కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు. లేటెస్ట్ వీడియోలతో సందడి చేస్తున్నాడు. సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్స్, యాక్టర్స్ అప్పుడప్పుడు.. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’తో పాటు పలు రియాలిటీ షోల్లో కనిపిస్తున్నారు. కొన్నిసార్లు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తూ.. మరికొన్నిసార్లు జడ్జిలుగానూ కనిపిస్తున్నారు. ఈ విధంగా బుల్లితెర కమెడియన్స్, నటీనటులతో బాండింగ్ పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనేవి ట్రెండింగ్ కాబట్టి స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్,
సిల్వర్ స్క్రీన్ కమెడియన్లతోనూ రీల్ చేస్తూ నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 30 ఇయర్స్ పృథ్వీ.. ‘జబర్దస్త్’ తన్మయితో చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘సార్’ మూవీలోని ‘మాస్టారూ.. మాస్టారూ’ పాటకు సింపుల్ స్టెప్పులేశారు. బ్యాగ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుండగా లిప్ సింక్ ఇచ్చారు. తన్మయి అంటే రెగ్యులర్‌గా రీల్స్ చేస్తుంటుంది కాబట్టి ఆమెకు అలవాటే..
కాకపోతే పృథ్వీ కాస్త కష్టపడ్డట్టు కనిపిస్తున్నాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పాటు కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అలాగే మరో రీల్ కూడా చేశారు. అందులో పృథ్వీ, తన్మయిని వెనుక నుండి కౌగలించుకున్నాడు. దీంతో నెటిజన్స్ కామెంట్లతో రెచ్చి పోతున్నారు. ‘‘ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది’’ అని కొందరు అంటుంటే.. మిగతా వారు.. ‘వెనుక నుండి వాటేసుకోవాలంటే పృథ్వీ తర్వాతే ఎవరైనా’’ అని గతంలో లీక్ ఆడియోలో పృథ్వీ మాటలతో కౌంటర్ వేస్తున్నారు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!