ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దీంతో రాజకీయంగా ఎవరు కామెంట్ చేసినా తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ నటుడు కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీ ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క మెగా బ్రదర్ నాగబాబు కూడా తన కొడుకు వరుణ్ తేజ్ తో కలిసి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి రూ.1.25 కోట్లు విరాళం అందించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీని పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదాలకు తెరలేపాయి. ‘అది ప్యాకేజీ రూపంలో వచ్చిన డబ్బని, దాన్నే నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారని పృధ్వీ కామెంట్స్ చేసాడు. ఇది తెలుసుకున్న నాగబాబు పృధ్వీ పై ఫైర్ అయ్యారు కూడా. ‘అరేయ్ పృధ్వీ నువ్వు నాకు ఫోన్ చెయ్.. నేను నీకే చెబుతున్నాను నా నెంబర్ నీ దగ్గర ఉంది నాకు ఫోన్ చెయ్యి’ అంటూ ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా పృథ్వీ కి వార్ణింగ్ ఇచ్చారు.
తాజాగా నాగబాబు వ్యాఖ్యలు తన దృష్టికి రావడంతో పృధ్వీ కూడా స్పందించారు. పృథ్వీ మాట్లాడుతూ… “నాగబాబు అంత ఆవేశంగా ఎందుకు స్పందించారో అర్ధం కాలేదు. రాత్రి 8 గంటల సమయంలో టీవీలో ఆ వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యాను. అసలు తనకు సంబంధం లేని వివాదంలో నా పేరు వినిపిస్తోందేంటని అనుకున్నాను. నాగబాబు చెప్పినట్లుగా ఆయనకి ఫోన్ చేసాను… అలాంటి ఆరోపణలు నేను చేస్తానని మీరు అనుకున్నారా..? అని ఆయన్ని ప్రశ్నించగా ఆ వివాదం అక్కడికే ముగిసిపోయింది. నాగబాబు నాకు మంచి స్నేహితుడు.. మేమిద్దరం కలిసి అప్పట్లో ‘ప్రజారాజ్యం’ పార్టీ కోసం పని చేసాం. నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకు ఆయనతో ఎలాంటి మనస్పర్థలు లేవు” అంటూ వివరణ ఇచ్చారు పృథ్వీ.