రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ ల మధ్య వివాదం నిజమేనా?

ఇటీవల ‘మహర్షి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల. ఇదిలా ఉండగా రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ గతంలో మంచి స్నేహంగా ఉండేవారు.. అయితే తరువాత వీరిద్దరూ పెద్దగా కలవడం లేదనే టాక్ ఉంది. ఈ క్రమంలో ‘అశోక్’ చిత్రం సమయంలో ఎన్టీఆర్.. రాజీవ్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఈ కారణంగానే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా వరకూ మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించలేదని గతంలో వార్తలొచ్చాయి. ఈ విషయం పై ఎట్టకేలకు రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో తనకు, ఎన్టీఆర్ కు మధ్య వివాదానికి సంబంధించిన వార్తల పై స్పందించాడు. రాజీవ్ మాట్లాడుతూ.. ” నేను ఇండస్ట్రీలో ఎవ్వరినీ వదులుకోను.. నన్ను దూరం పెట్టాలని భావిస్తే అది వారి ఇష్టం. ఎన్టీఆర్ కు, నాకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే! నాకు, ఎన్టీఆర్ కు విధేదాలు ఉంటే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో ఎందుకు నటిస్తాను ? అలాగని ఎన్టీఆర్ ప్రతి చిత్రంలోనూ నేను నటించాలంటే కుదరదు. అది దర్శకుల ఛాయిస్.! ఎన్టీఆర్ నాకన్నా వయసులో చిన్నవాడు. మా ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ‘స్టూడెంట్ నెం1’ సినిమా సినిమా టైములో ‘నన్ను మరిచిపోవద్దని’ చెప్పాను. ‘నిన్నుఎప్పటికీ మరచిపోను’ అని ఎన్టీఆర్ నాతో అన్నాడు. అప్పటి నుండీ స్నేహితులుగానే కొనసాగుతున్నాం. కుటుంబ బాధ్యతల వలన మునుపటిలా మేము కలుసుకోలేకపోతున్నాం” అంటూ రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus