Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

ప్రభాస్ లైనప్ లో ఎన్ని సినిమాలు ఉన్నా, ఆడియన్స్ ఆసక్తి మొత్తం ‘స్పిరిట్’ మీదే ఉంది. దానికి కారణం సందీప్ రెడ్డి వంగా. ‘యానిమల్’లో చూపించిన వైలెన్స్ ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే, ఇప్పుడు ప్రభాస్ తో అంతకు మించిన విధ్వంసాన్ని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Spirit

సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్టింగులు వేస్తున్నారు. సాధారణంగా రియలిస్టిక్ లొకేషన్స్ ఇష్టపడే వంగా, ఈసారి సెట్స్ వైపు వెళ్తున్నారంటే విషయం గట్టిగానే ఉందన్నమాట. ఇందులో ప్రభాస్ చేసే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట. ఏకంగా 200 మంది ఫైటర్లతో ప్రభాస్ తలపడేలా ఈ సీన్ డిజైన్ చేశారు.

కేవలం ఈ ఒక్క ఫైట్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ పోలీస్ గెటప్ లో, చేతిలో ఆయుధం పట్టుకుని వందల మందిని ఎదిరించే ఆ సీన్.. థియేటర్లలో విజిల్స్ వేయిస్తుందని అంటున్నారు. గతంలో సందీప్ వంగా చూపించిన ఇంటర్వెల్ బ్లాక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ఈ 200 మంది ఎపిసోడ్ అంతకు మించి ఉంటుందని టాక్.

దీనికోసం ఫైట్ మాస్టర్లు, టెక్నీషియన్లు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రభాస్ కూడా ఈ హై వోల్టేజ్ యాక్షన్ కోసం స్పెషల్ గా ప్రిపేర్ అవుతున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దుతుండటంతో, ప్రతి ఫ్రేమ్ లో గ్రాండియర్ కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు స్క్రిప్ట్ వర్క్ తోనే సరిపెట్టిన టీమ్, ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి దిగింది. ఈ భారీ షెడ్యూల్ తోనే ‘స్పిరిట్’ రేంజ్ ఏంటో దేశానికి తెలిసిపోతుంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus