మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అదే ‘మనశంకర్ వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సుస్మిత కొణిదెల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటివరకు ‘మీసాల పిల్లా’ ‘శశిరేఖ’ వంటి పాటలు రిలీజ్ చేశారు. రెండిటికీ మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వినిపించింది.. కానీ తర్వాత బాగానే ఎక్కేశాయి. యూట్యూబ్లో వాటికి మంచి వ్యూయర్షిప్ నమోదవుతుంది. కానీ ఇప్పటివరకు టీజర్ లాంటిదేమీ రిలీజ్ చేయలేదు. సో కథ, కథనాలు ఎలా ఉంటాయి? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉండగా… ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమా కథ కాపీ అంటూ ఇన్సైడ్ టాక్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. వాటి ప్రకారం చూసుకుంటే.. ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమా కథ అజిత్ నటించిన ‘విశ్వాసం’, వెంకటేష్ నటించిన ‘బాడీ గార్డ్’ సినిమాల కథలకి దగ్గరగా ఉంటుందట. చిరంజీవి ఈ సినిమాలో బాడీ గార్డ్ గా కనిపిస్తారని, తర్వాత హీరోయిన్ ని ప్రేమించడం, పెళ్లిచేసుకోవడం, విడిపోవడం జరుగుతుందట.
చివర్లో మళ్ళీ ఎలా కలుసుకున్నారు? మధ్యలో వెంకటేష్, కేథరిన్..ల పాత్రలు ఏంటి? అనే సస్పెన్స్ రేకెత్తిస్తూ సినిమా కథనం ఉంటుందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. మొత్తంగా సినిమాలో ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు.