Satya Prakash: ఆ హీరోయిన్ నన్ను దుర్మార్గుడని అన్నది: నటుడు సత్యప్రకాశ్

నెగిటివ్ రోల్స్ చేసి విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్య ప్రకాష్. తెలుగులో దాదాపు 20కి పైగా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య ప్రకాష్ తన సినీ కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సత్య ప్రకాష్‌ను ‘‘అప్పటి సినిమాల్లో ఎక్కువగా రేప్ సీన్లలో నటించేవారు కదా. ఆ సన్నివేశాలు చేసేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడేవారా?’’ అని అడిగితే, సత్య ప్రకాష్ బదులిస్తూ..

“మొదట్లో చాలా ఇబ్బంది పడేవాడిని. నిజం చెప్పాలంటే నేను అలాంటి సినిమాల్లో అసలు నటించను. నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ పాత్ర నేను చెయ్యను, చేయలేను అని చెప్పే స్తోమత నాకు అప్పుడు లేదు. తెలుగులో చాలా సినిమాల్లో రేప్ సన్నివేశాల్లో నటించాను” అని అన్నారు. “నేను భోజ్ పూరి సినిమా చేస్తున్న సమయంలో రేప్ సీన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు.

ఆ ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ‘‘సిటీలో కొత్తగా రేపిస్ట్ వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి’’ అని పెద్ద హెడ్ లైన్స్ తో రాశారు. కానీ కంటెంట్ లోకి వెళ్తే ఇలా పలానా సినిమాలో ఈయన రేప్ సీన్ లో నటించారు అని రాశారు” అని చెప్పుకొచ్చాడు. ‘‘సౌందర్య గారితో ఓ రేప్ సీన్ చేస్తున్న టైంలో ఆమె డైరెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట కదా? అని యాంకర్ అడిగితే.. “చూడాలని ఉంది మూవీ టైంలో అనుకుంటా. ఆ సినిమాలో ఆవిడే హీరోయిన్.

నేను అన్నపూర్ణ స్టూడియోలోని ఓ సెట్ లో షూటింగ్ చేస్తుంటే పక్కనే చిరంజీవి గారు ఉన్నారని తెలిస్తే కలవడానికి వెళ్లాను. అప్పుడు చిరంజీవి గారి పక్కన సౌందర్య కూర్చున్నారు. అప్పుడు సౌందర్య, చిరంజీవి గారు నా కెరియర్ లో ఒకే ఒక్క సినిమాలో రేప్ జరిగింది. ఆ రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అని చిరంజీవి గారితో చెప్పింది. అప్పుడు నేను (Satya Prakash) దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకున్నాను” అని తెలిపారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus