Sivakarthikeyan: సింహాన్ని దత్తత తీసుకొని జంతువుల పట్ల ప్రేమ చాటుకున్న హీరో?

ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. కొందరు సామాజిక సేవ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున డబ్బును ఉపయోగిస్తున్నారు అలాగే మరికొందరు జంతు సంరక్షణ కోసం భారీ స్థాయిలో డబ్బులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే జంతు ప్రేమికుడుగా పేరుపొందినటువంటి శివ కార్తికేయన్ మరోసారి జంతువుల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ చాటుకున్నారు.

కెరియర్ మొదట్లో కమెడియన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన (Sivakarthikeyan) శివ కార్తికేయన్ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని హీరోగా నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇలా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ కార్తికేయన్ తన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శివ కార్తికేయన్ స్వతహాగా జంతు ప్రేమికుడు. ఈ క్రమంలోనే జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు.. ఈయన గతంలో కూడా ఒక సింహాన్ని ఏనుగును ఆరు నెలల పాటు దత్తత తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈయన సింహాన్ని దత్తత తీసుకున్నారు.

వండలూరులోని అరిగార్న్ అన్నా జులాజికల్ పార్క్ లో షేరు అనే మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి సింహాన్ని ఈయన ఆరు నెలల పాటు దత్తత తీసుకున్నారు. ఈ ఆరు నెలల పాటు ఆ సింహానికి అవసరమయ్యే ఆహారంతో పాటు ఇతరత ఖర్చులు అన్నింటిని కూడా ఈయనే భరించనున్నారు. ఈయన సింహాన్ని దత్తత తీసుకున్నారనే విషయం తెలియడంతో జంతు ప్రేమికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2021 వ సంవత్సరంలో ఇదే పార్కులో ఈయన సింహంతో పాటు ఏనుగును కూడా దత్తత తీసుకోవడం విశేషం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus