టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సోనూసూద్ కు (Sonu Sood) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సోనూసూద్ వార్తల్లో నిలిచారు. తాజాగా సోనూసూద్ మరో మంచి పని చేసి తన మంచి మనస్సును చాటుకున్నారు. మూడేళ్ల బాలుడి గుండెకు సర్జరీ చేయించి సోనూసూద్ వార్తల్లో నిలిచారు. సోనూసూద్ ను నెటిజన్లు మెచ్చుకుంటుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో విలన్ గా నటించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నారు.
డెహ్రాడూన్ కు చెందిన ఒక పేద కుటుంబంలోని బాలుడు గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నట్టు సోనూసూద్ దృష్టికి వచ్చింది. బాలుడి సర్జరీకీ అవసరమైన ఎన్ని ఏర్పాట్లు చేసిన సోనూసూద్ సర్జరీ చేయించడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సోనూసూద్ బిజీగా ఉన్నారు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యను సోనూసూద్ వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించడం ద్వారా పరిష్కరించడం జరిగింది.
డబ్బు రూపంలో సహాయం చేస్తే మోసపోయే అవకాశం ఉండటంతో సోనూసూద్ ఆస్పత్రుల ద్వారా సహాయ కార్యక్రమాలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. సోనూసూద్ కు సోషల్ మీడియాలో ఏకంగా 16.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోనూసూద్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. డిమాండ్ కు అనుగుణంగా సోనూసూద్ రెమ్యునరేషన్ తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
సోనూసూద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సోనూసూద్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. సోనూసూద్ తెలుగులో కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విలన్ రోల్స్ లో కాకపోయినా మంచి రోల్స్ లో నటిస్తే బాగుంటుందని అభిమానులు చెబుతున్నారు.