అలీతో సరదాగా కాసేపు అంటూ యాక్టర్ సురేష్ ఇచ్చిన ఇంటర్య్వూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడా ఎవరికీ చెప్పని సంగతులని చెప్పాడు. తన మొదటి భార్యతో ఎందుకు విడాకులు తీస్కోవాల్సి వచ్చిందో వివరించాడు. 1990లో అనిత అనే తమిళ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి వీళ్లు విడాకులు తీస్కున్నారు. అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో ఇప్పటివరకూ ఎవ్వరికీ చెప్పాని సీక్రెట్స్ ని ఈ ఇంటర్య్వూలో పంచుకున్నాడు. 1990 లో నేను ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ప్రేమలో ఉన్నప్పుడు తను ఒక కండీషన్ పెట్టింది.
పెళ్లి అయిన తర్వాత అన్నీ వదిలేసి యుఎస్ వెళ్లి సెటిల్ అవ్వాలని చెప్పింది. అప్పుడు నేను ఒప్పుకున్నాను. కానీ, తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయాను. వరసుగా ఆఫర్లు వస్తున్నాయి. తనకి ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేశాను. తర్వాత మా ఇద్దరి మద్యలో గ్యాప్ పెరిగింది. తన పని తాను చేసుకుంటూ వెళ్లేది. నేను నా పని నేను చేసుకునే వాడ్ని. ఒకరోజూ ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని విడాకులు తీస్కోవడానికి రెడీ అయ్యాం. అంతేకానీ, మా మధ్యలో ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పాడు. అంతేకాదు, ఇప్పటికీ తను నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటుందని, తన భర్త కూడా నాతో మాట్లాడతాడు అని, అలాగే నా భార్య కూడా వాళ్లతో మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు ఈ హీరో.
తన మాజీ భార్యతో ఉన్న స్నేహాన్ని ఈ ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాదు, తమిళంలో నాగార్జున సినిమాలన్నింటికీ సురేషే డబ్బింగ్ చెప్తాడని, ఆ సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయని అన్నాడు. ఇక తెలుగులో కూడా అరవింద స్వామికి తానే నవాబ్ సినిమాలో డబ్బింగ్ చెప్పానని అన్నాడు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే ఎన్నో క్రాఫ్ట్స్ లో పనిచేయడం అలవాటు అయ్యిందన్నాడు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాస్తున్నానని అన్నాడు సురేష్. మొత్తానికి తన మనసులో ఉన్న మాటలన్నింటినీ చెప్పాడు ఈ హీరో.