విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

సినీ పరిశ్రమలో హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడం అనేది కామన్ పాయింట్. గ్లామర్ గా కనిపించాలని భావించి వారు సర్జరీలను ఆశ్రయించేవారు. బరువు తగ్గడానికి కూడా సర్జరీలను ఆశ్రయించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇక కొంత కాలం తర్వాత హీరోలు కూడా సర్జరీలు చేయించుకుని స్లిమ్ అయ్యేవారు. అయితే అతి తక్కువ మంది మాత్రం పాత్రలను ప్రేమించి ఆ సినిమాల కోసం ఎన్నో కసరత్తులు చేసి స్లిమ్ అయ్యారు. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :

Stars Transformed Without Surgery

1) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ వరకు స్లిమ్ గానే ఉండేవారు. కానీ ‘జానీ’ కోసం లుక్ కంప్లీట్ గా మార్చేశారు. ఆ సినిమా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణే దర్శకత్వం వహించారు. చాలా ఇష్టపడి పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇది. ఇందులో పాత్ర కోసం పవన్ కళ్యాణ్ బాగా డైటింగ్ చేసి బక్కచిక్కిపోయారు. ఈ సినిమాలో పవన్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫలితం ఆశించినట్టు రాకపోయినా… ఫైట్స్ కోసం పవన్ కష్టపడిన తీరుకి ప్రశంసలు కురిశాయి.

2) ఎన్టీఆర్ (Jr NTR): ‘రాఖీ’ వరకు ఎన్టీఆర్ పుష్టిగా ఉండేవాడు. తర్వాత ‘యమదొంగ’ సినిమా కోసం రాజమౌళి సూచన మేరకు ‘లైపో..’ చేయించుకుని స్లిమ్ అయ్యాడు. ఆ సినిమా కోసం అతను దాదాపు 35 కేజీలు తగ్గడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. దాని తర్వాత ‘కంత్రి’ కోసం మరింత సన్నబడ్డాడు ఎన్టీఆర్. అప్పటి నుండి ఫిజిక్ ను స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కోసం ఆర్గానిక్ మెథడ్ లో మరింత స్లిమ్ అయ్యాడు. ఇటీవల అతని లుక్స్ చూసి ఫ్యాన్స్ సైతం షాక్ కి గురయ్యారు. క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్లనే ఎన్టీఆర్ మరింత స్లిమ్ అయినట్టు స్పష్టమవుతుంది.

3) ప్రభాస్ (Prabhas): ‘యోగి’ ‘మున్నా’ సినిమాల్లో ప్రభాస్ బొద్దుగా కనిపిస్తాడు. కానీ ‘బుజ్జిగాడు’ పాత్ర కోసం చాలా వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ‘ ఫౌజి’ కోసం కూడా ప్రభాస్ లుక్ మార్చాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ బాగా బరువు పెరిగాడు. వరుసగా పెద్ద సినిమాలు చేస్తుండటం వల్ల ఫిజిక్ పై అతను ఫోకస్ చేసింది లేదు. అయితే ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజి’ కోసం అతను బాగా స్లిమ్ అయ్యాడు. దీని కోసం అతను లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం. ‘కన్నప్ప’ లో కూడా ప్రభాస్ చాలా సన్నగా కనిపించాడు. ఆ లుక్ ‘ ఫౌజి’ అని తెలుస్తుంది.

4) మహేష్ బాబు (Mahesh Babu): చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రోజుల్లో మహేష్ కొంచెం బొద్దుగా ఉండేవాడు. కానీ ఫుల్ లెంగ్త్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు స్లిమ్ గా కనిపించాడు. అప్పటి నుండి ఆల్మోస్ట్ అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మధ్యలో ‘సైనికుడు’ ‘అతిథి’ ‘ఖలేజా’ వంటి సినిమాల్లో బొద్దుగా కనిపించాడు. మళ్ళీ ‘దూకుడు’ నుండి స్లిమ్ అయ్యాడు. అయితే ‘1 నేనొక్కడినే’ కోసం వర్కౌట్లు చేసి మరింతగా సన్నబడ్డాడు. గౌతమ్ అనే పాత్ర కోసం మహేష్ చాలా శ్రద్ధ వహించి కష్టపడ్డారు అని చెప్పాలి.

5) రానా దగ్గుబాటి (Rana Daggubati): ‘బాహుబలి’ లో కొంచెం బొద్దుగా కనిపించిన రానా.. తర్వాత ‘అరణ్య'(హాతి మేరె సాతి) అనే సినిమా కోసం చాలా వర్కౌట్లు చేసి బరువు తగ్గారు. మరో మాటలో చెప్పాలంటే బక్కచిక్కిపోయారు అని చెప్పాలి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో చంద్రబాబు లుక్ కోసం కూడా రానా ఇదే ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతని హెల్త్ కూడా అప్సెట్ అయ్యింది.

6) విక్రమ్ (Vikram): తమిళ స్టార్ హీరో విక్రమ్ పాత్ర కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేస్తాడు. ఇది ‘ఐ’ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యాడు. ఒక పాత్ర కోసం అయితే తిండి మానేసి బక్కచిక్కిపోయాడు. సహజత్వం కోసం అతను అంతలా పరితపిస్తుంటాడు.

7) పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran): మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ‘ది గోట్ లైఫ్'(ఆడు జీవితం) సినిమా కోసం లైఫ్ పెట్టేశారు. ఈ సినిమా కోసం అతను తిండి మానేసి బక్క చిక్కిపోయాడు. సినిమా చూసిన వారికి ఆ విషయం అర్థమవుతుంది. సంపాదన కోసం దుబాయ్, సౌదీ వంటి దేశాలకు వలస వెళ్లి ఇబ్బంది పడుతున్న వారి జీవితాల ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నిజంగానే తిండి లేక ఎండిపోయినట్టు ఉంటాడు.

8) శింబు (Simbu): కోవిడ్ టైం వరకు శింబు భారీ కాయంతో కనిపించాడు. కానీ తర్వాత అతను చాలా వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో చేసిన ‘ఈశ్వరన్’ కోసం శింబు చాలా స్లిమ్ అయ్యారు. అప్పటి నుండి అతను అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.

9) కళ్యాణ్ రామ్ (Kalyan Ram): ‘షేర్’ సినిమా వరకు కళ్యాణ్ రామ్ చూడటానికి కొంచెం బొద్దుగా ఉండేవారు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇజం’ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యారు. జర్నలిస్ట్ సత్య మార్తాండ్ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ స్లిమ్ అవ్వడం జరిగింది.

10) నాగ శౌర్య (Naga Shaurya): లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య.. ‘ఛలో’ సినిమా వరకు బొద్దుగా కనిపిస్తూ వచ్చాడు. కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అశ్వద్ధామ’ కోసం జిమ్ లో చాలా కసరత్తులు చేసి స్లిమ్ అయ్యాడు. ఇప్పటికీ అతను అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.

కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus