Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మంచి కంటెంట్ ఉన్న సినిమాతో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది: ఐశ్వర్య రాజేష్

మంచి కంటెంట్ ఉన్న సినిమాతో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది: ఐశ్వర్య రాజేష్

  • August 23, 2019 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి కంటెంట్ ఉన్న సినిమాతో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది: ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 23 ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూ..

1. మీ గురించి చెప్పండి?

actress-aishwarya-rajesh-special-interview1

– నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. దాదాపు 25 తమిళ్‌, 2 మలయాళం, ఒక హిందీ సినిమాలో నటించాను. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు అని. మా నాన్నగారు రాజేష్‌ ‘మల్లెమొగ్గలు’, రెండు జళ్ల సీత’, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్తయ్య శ్రీలక్ష్మి కమెడియన్‌గా మీ అందరికీ సుపరిచితురాలు. అమర్‌నాథ్‌గారు మా తాతగారు. ఆయన కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు ఉంది.

2. తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో చేసిన మీరు తెలుగులో ఇంతవరకు చేయకపోవడానికి కారణం?

actress-aishwarya-rajesh-special-interview2

– ఒక మంచి సినిమా కోసం చాలా రోజుల నుండి వెయిట్‌ చేశాను. మీరు చూసుకుంటే తమిళ్‌లో నేను చేసిన క్యారెక్టర్స్‌ అన్నీ పెర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. ‘కాకముట్టై’, ‘కణ’, ‘ధర్మదురై’, ‘వడచెన్నై’ వంటి విభిన్నతరహా చిత్రాల్లోనే ఎక్కువగా నటించాను. తెలుగులో కూడా మంచి సినిమాతో ఇంట్రడ్యూస్‌ అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ఒక మంచి సినిమాతోనే తెలుగులో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

3. ఈ ప్రాజెక్ట్‌ ఎలా ఓకె అయ్యింది?

actress-aishwarya-rajesh-special-interview3

– విజయ్‌ దేవరకొండ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో క్యారెక్టర్‌ కోసం ‘కణ’ టీజర్‌ చూసి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఆ సినిమా తమిళ్‌లో లాస్ట్‌ ఇయర్‌ డిసెంబర్‌ 21న రిలీజై పెద్దహిట్‌ అయ్యింది. ఆ సినిమా నాకు చాలా అవార్డ్సు తెచ్చిపెట్టింది. తర్వాత రామారావుగారు ఆ సినిమాని తెలుగులో రీమేక్‌ చెయ్యాలని రైట్స్‌ తీసుకొని నాతోనే తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో నిర్మించారు.

4. తమిళ్‌ సినిమాని తెలుగులో చేయడం ఎలా అనిపిస్తోంది?

actress-aishwarya-rajesh-special-interview4

– తమిళంలో ఈ సినిమాను చాలామంది ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు తమిళంలో నేను చూసి.. ఏఏ సీన్‌లైతే ఇంకా బాగా చేసుంటే బాగుండేది అనుకున్న సన్నివేశాల్ని తెలుగులో మళ్లీ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాకి తమిళ్‌ ఆడియన్స్‌ మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. తెలుగు ఆడియన్స్‌ కూడా ఇంకా మంచి రెస్పాన్స్‌ ఇస్తారని నమ్ముతున్నాను.

5. రాజేంద్రప్రసాద్‌తో వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?

actress-aishwarya-rajesh-special-interview5

– రాజేంద్రప్రసాద్‌గారితో ఇది నా మొదటి సినిమా కాదు. గతంలో వచ్చిన ‘రాంబంటు’ సినిమాలో ఒక సాంగ్‌లో చిన్న క్యారెక్టర్‌ చేశాను. మళ్ళీ ఈ చిత్రంలో ఆయనతో యాక్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా నాన్నగారికి మంచి ఫ్రెండ్‌. ఆయనతో నేను నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్‌ చేసుకున్నారు. తమిళ్‌లో సత్యరాజ్‌గారితో ఎంత మంచి వైబ్స్‌ ఉందో తెలుగులో రాజేంద్రప్రసాద్‌గారితో కూడా అలాంటి ఫీల్‌ కలిగింది.

6. తెలుగు బాగా మాట్లాడుతున్నారు.. తెలుగు చదువుతారా?

actress-aishwarya-rajesh-special-interview6

– చదువుతాను. నేను తిరుపతిలో మోహన్‌బాబుగారి శ్రీవిద్యానికేతన్‌లో నాలుగైదేళ్లు చదువుకున్నాను. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళాను.

7. తమిళ్‌లో చేసిన క్యారెక్టర్‌ మళ్లీ చేయడం ఎలా అన్పిస్తుంది?

actress-aishwarya-rajesh-special-interview7

– అదే క్యారెక్టర్‌ మళ్లీ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందులోనూ అది టఫ్‌ క్యారెక్టర్‌. తమిళ్‌లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగులో కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నా.

8. ఈ సినిమా కోసం క్రికెట్‌ నేర్చుకున్నారా?

actress-aishwarya-rajesh-special-interview8

– అవును. క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్‌ పోకూడదని ఫీమేల్‌ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్‌ చేశాను. షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అలా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ నేర్చుకున్నాను. తెలుగులోకి వచ్చినప్పుడు ఆ స్కిల్స్‌ని కొంచెం పాలిష్‌ చేశాను.

9. బౌలింగ్‌లో ఫస్ట్‌బాల్‌కే వికెట్‌ తీశారంట?

actress-aishwarya-rajesh-special-interview9

– తెలుగులో ఫస్ట్‌ షాట్‌ చేద్దామనుకున్నప్పుడు క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేద్దామని మూడు కెమెరాలు, ఒక డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేయడం జరిగింది. అలా ఫస్ట్‌టైమ్‌ బౌలింగ్‌ చేయగానే వికెట్‌ పడింది. దాంతో అందరూ ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అనుకున్నారు. ఈ సినిమాలో బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండూ ఎంజాయ్‌ చేశాను.

10. ఈ క్యారెక్టర్‌ చేయడానికి మిమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేసిన అంశాలేంటి?

actress-aishwarya-rajesh-special-interview10

– నా క్యారెక్టర్స్‌ అన్నీ విభిన్నంగానే ఉంటాయి. తమిళంలో ‘కాకముట్టై’ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాను. మలయాళంలో 70 సంవత్సరాల వృద్ధురాలుగా చేశాను. అలాగే హిందీలో కూడా 16 నుండి 65 సంవత్సరాల వయస్సుగల పాత్ర పోషించాను. నాకు క్రికెట్‌ రాదు. నేర్చుకొని చేస్తే ఇంకా ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఈ సినిమా చేశాను.

11. నిర్మాత కె.ఎస్‌. రామారావు గురించి?

actress-aishwarya-rajesh-special-interview11

– ఈ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ఆశ పడితే చాలదు.. దాన్ని పట్టుబట్టి సాధించాలి అని. ఆ డైలాగ్‌ కె.ఎస్‌. రామారావుగారికి కరెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఆయన అంత పట్టు బట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి మెమొరబుల్‌ మూవీగా నిలుస్తుంది.

12. నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

actress-aishwarya-rajesh-special-interview12

– ఇదే బేనర్‌లో క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సరసన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. అలాగే ‘మిస్‌ మ్యాచ్‌’ చిత్రం చేశాను. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాను.

Click Here to Movie Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Kousalya Krishnamurthy Collections
  • #Kousalya Krishnamurthy Movie
  • #Kousalya Krishnamurthy Movie Review
  • #Kousalya Krishnamurthy Review

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

3 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

4 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

14 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

15 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

22 mins ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

40 mins ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

19 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

20 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version