బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRసినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ఈమె నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆలియా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ వచ్చారు.
ఇకపోతే ఇండస్ట్రీలో ఆగ్రతారగా కొనసాగుతూనే ఈమె నటుడు రణబీర్ కపూర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇద్దరూ 2022 ఏప్రిల్ 14వ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.పెళ్లయిన రెండు నెలలకే అలియా గర్భవతి అని ప్రకటించడమే కాకుండా నవంబర్ నెలలోనే ఈ దంపతులు ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా అలియా భట్ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని
పిల్లలకు జన్మనివ్వడంతో తన కెరియర్ పై చాలా ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇదే విషయం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తర్వాత ఒక మహిళ జీవితం అక్కడికి ఆగిపోతుంది అనడంలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.
ఒకవేళ అలాగే కనుక జరిగితే జరగనివ్వండి నాకు ఈ విషయంలో ఎలాంటి బాధ లేదు ఎందుకంటే పెళ్లి,పిల్లలను కనడం నా జీవితంలో నేను తీసుకున్న గొప్ప నిర్ణయాలు అంటూ ఈమె పెళ్లి పిల్లల గురించి స్పందించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?