Amyra Dastur: మాల్దీవుల్లో మంట పుట్టిస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఈమధ్య టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లంతా మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. తెలుగు బుల్లితెర యాంకర్స్ రష్మీ లాంటి వాళ్లు కూడా అక్కడ బీభత్సమైన హంగామా చేశారు.. ఆ పిక్స్, వీడియోస్ ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే..ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ కూడా మాల్దీవుల్లో భలే సందడి చేస్తోంది.. అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. అందాలారబోస్తూ నెటిజన్లకు కిక్ ఇస్తోంది.. తెలుగులో సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ తో ఎంట్రీ ఇచ్చి.. రాజ్ తరుణ్ ‘రాజు గాడు’ లోనూ నటించింది..

హిందీ, ఇంగ్లీష్, మెరిడియన్ (కుంగ్ ఫూ యోగా) తో పాటు తమిళ్‌లోనూ యాక్ట్ చేసింది కానీ బాలీవుడ్‌లోనే గుర్తింపు తెచ్చుకుంది.. ఇక మాల్దీవుల్లో అండర్ వాటర్‌లో సాహసాలు చేస్తూ.. బికినీలో పరువాల జాతర చేస్తున్న కొన్ని పిక్స్ షేర్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి.. ‘సముద్రంలో నిన్ను చూస్తుంటే.. జలకన్యలా ఉన్నావ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల మంది అమైరాను ఫాలో చేస్తున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus