Anjali: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ గలాటా.. అంజలి ట్వీట్‌ వైరల్‌! ఏం రాసిందంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) బయటకు వచ్చాడంటే, అందులో సినిమా ఈవెంట్‌కి వచ్చాడంటే కచ్చితంగా ఏదో ఒక చర్చ ఉంటుంది. ఆయన అలా అన్నారని, ఇలా చేశాడని కామెంట్స్‌ వస్తుంటాయి. అలా రీసెంట్‌గా బాలయ్య హాజరైన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఇందులో ఒక విషయానికి ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇవ్వగా.. మరో విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా నటి అంజలి (Anjali) ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విచ్చేసిన నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. మా ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉంది. మేమిద్దరం చాలా ఏళ్లుగా మంచి స్నేహితులం కూడా. ఆయనతో స్టేజీని షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో మరోసారి స్టేజీ షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అంటూ అంజలి ఎక్స్‌ (మాజీ ట్విటర్‌లో) పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

మామూలుగా అయితే ఇదో సాధారణ థ్యాంక్స్‌ మెసేజ్‌ అని చెప్పాలి. తన సినిమా ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ ధన్యవాదాలు చెప్పడం ఆ మెసేజ్‌ వెనుక ఉద్దేశం. అయితే ఆ రోజు ఈవెంట్‌లో జరిగింది వేరేది కాబట్టి.. ఈ మెసేజ్‌ను వేరే విధంగా కూడా చూడాలి అని అంటున్నారు నెటిజన్లు. ఆ ఈవెంట్‌లో అంజలిని బాలకృష్ణ నెట్టేశాడు అంటూ వీడియో క్లిప్‌ వైరల్‌ అయింది.

అయితే అది సరదాకి చేసింది అని మొత్తం వీడియో చూసినవాళ్లకు తెలుసు. సగం వీడియో చూసి జడ్జి చేసేవాళ్ల కోసం ఈ క్లారిటీ అని అంటున్నారు. గెస్ట్‌లు స్టేజీ సెంటర్‌కి వచ్చేలా చేయడం కోసం బాలయ్య అలా పక్కకు వెళ్లమన్నాడు అనేది టీమ్‌, అభిమానుల మాట. మరి జనాలు ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇక్కడితే వదిలేస్తారా? లేక కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఇంకా లాగుతారా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags