Asin: హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

  • June 19, 2021 / 11:55 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ఆసిన్. 2003 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి రవితేజ క్రేజ్ ను మరింతగా పెంచింది.నిజానికి ఆసిన్ కేరళకు చెందిన అమ్మాయి.. అంటే మలయాళీ అమ్మాయి. కానీ ‘మలయాళ అమ్మాయిని.. తమిళ్ అమ్మాయిగా చూపించి.. తెలుగులో ఫేమస్ చేసాడు’ అంటూ పూరి పై అప్పట్లో ఫన్నీ సెటైర్లు కూడా పడ్డాయి.

ఇక ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే నాగార్జునతో చేసిన ‘శివమణి’ సినిమాలో కూడా ఆసిన్ కు ఛాన్స్ ఇచ్చాడు పూరి. ఈ మూవీ కూడా హిట్ అయ్యింది. దీంతో బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహ’, వెంకటేష్ తో ‘ఘర్షణ’, పవన్ కళ్యాణ్ తో ‘అన్నవరం’, ప్రభాస్ తో ‘చక్రం’ వంటి సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఆసిన్. తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా ఈమె క్రేజ్ ను సంపాదించుకుంది. ‘గజిని’ సినిమాలో ఈమె నటనకి ప్రశంసలు దక్కాయి.

అయితే స్టార్ హీరోయిన్ గా ఈమె రాణిస్తున్న టైంలోనే 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఆసిన్. రాహుల్ శర్మ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓ అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఆసిన్ కు ఓ పాప. నిజానికి ఆసిన్ ఎటువంటి సోషల్ మీడియా ఖాతా ను మెయింటైన్ చేయడం లేదు. అయితే ఆమె ఫ్యామిలీ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులోని ఓ ఫోటోలో ఆసిన్ గుర్తుపట్టలేని విధంగా ఉండటం గమనార్హం .

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus