Avika Gor: అప్పుడు ఓకే కానీ.. ఇప్పుడు గుర్తొస్తేనే కామెడీగా అనిపిస్తోంది: అవికా గోర్‌

సీరియల్స్‌ మీద చాలా రకాల జోక్‌లు ఉంటాయి. సంవత్సరాల తరబడి సాగుతుంటాయని, పుట్టడం, పెద్దవాళ్లవ్వడం, పెళ్లి.. ఇలా అన్నీ ఊహించని స్పీడ్‌లో జరిగిపోతుంటాయని జోక్‌లు వేస్తుంటారు. నిజ జీవితంలో ఏ మాత్రం వీలు కాని ఎన్నో విషయాలు సీరియళ్లలో చూడొచ్చు అని కూడా అంటుంటారు. అయితే ఈ మాటలను సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుని హీరోయిన్‌ అయిన అమ్మాయే చెబితే… అవును ఈ మాట ఓ హీరోయిన్‌ ఈ మాటే చెప్పింది. తన సీరియల్‌ను ఇప్పుడు చూస్తుంటే నవ్వొచ్చేలా ఉందని కూడా చెప్పింది.

‘బాలికా వధు’ అనే సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది అవికా గోర్‌. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీ నుండి సినిమాల్లోకి వచ్చి క్రేజీ హీరోయిన్‌ అయ్యింది. అయితే ఈ క్రమంలో సినిమాల ఎంపిక విషయంలో ఇబ్బందిపడి కెరీర్‌ను సీరియల్స్‌ స్థాయిలో తీసుకెళ్లలేకపోయింది. అయితే అడపాదడపా సినిమాలైతే చేస్తూ ఉంది. అలా ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమా ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పాత రోజులను గుర్తు చేసుకుంది అవికా గోర్‌.

‘ససురాల్‌ సిమర్‌ కా’ సీరియల్‌లోని కొన్ని విషయాల గురించి అవికా గోర్‌ మాట్లాడుతూ ఇప్పుడు చూస్తుంటే చాలా నవ్వొచ్చేలా ఉందని చెప్పుకొచ్చింది. ‘‘ససురాల్‌ సిమర్‌ కా’ సీరియల్‌లో కొన్ని సీన్స్‌ ఇబ్బందికరంగా, వాస్తవానికి దూరంగా అనిపించాయని చెప్పింది అవికా గోర్‌. ఆ సీరియల్‌లో తనను మూడుసార్లు చచ్చిపోయి తిరిగి వచ్చినట్టు చూపించారని తెలిపింది. అలాగే దెయ్యాలతో మాట్లాడుతున్నట్లు చూపించారని చెప్పుకొచ్చింది.

ఆ సీరియల్‌ అవికాకు (Avika Gor) ఏడుసార్లు పెళ్లి చేశారట. మూడుసార్లు హీరోతో కాగా, మరో నాలుగుసార్లు వేరే వ్యక్తులతో వివాహం చేసినట్లు చూపించారు. ఆ సీన్స్‌ని ఇప్పుడు చూస్తున్నా, తలచుకున్నా నవ్వొస్తుంది అని అవికా చెప్పింది. బద్ధకం వల్ల ఒకానొక సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేకపోయానని, దీంతో విపరీతంగా బరువు పెరిగిపోయానని చెప్పింది. అయితే కామెంట్స్‌ రావడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి సన్నగా మారానని తెలిపింది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus