Bhumika, Gunasekhar: 20 ఏళ్ళ తర్వాత కూడా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న ‘ఒక్కడు’ యూనిట్!

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయన పేరు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మహేష్ 47 వ ఏట అడుగు పెట్టాడు.మహేష్ పుట్టినరోజు సంబరాలు 4 రోజుల క్రితమే మొదలయ్యాయి. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది అనే చెప్పాలి. ఈ సందర్భంగా మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రాలు అయిన ‘ఒక్కడు’, ‘పోకిరి’ చిత్రాలు చిత్రాలు చాలా చోట్ల స్పెషల్ షో లు వేయడం జరిగింది.

ఈ క్రమంలో భారీగా జనాలు అంటే ఓ రిలీజ్ సినిమాకి వచ్చినట్టు థియేటర్ కు వచ్చారు. హైదరాబాద్ ప్రసాద్స్ లో వేసిన ‘ఒక్కడు’ స్పెషల్ షోకి ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ అలాగే హీరోయిన్ భూమిక కూడా హాజరయ్యి సందడి చేశారు. షో చూసిన అనంతరం వారు ఆ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రాన్ని ఎం ఎస్ రాజు నిర్మించారు.

2003 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో మాత్రమే కాదు టాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి మహేష్ ను స్టార్ హీరోని చేసింది. ‘ఒక్కడు’ ని బ్లాక్ బస్టర్ అనే ఒక్క మాటతో సరిపెట్టేయడానికి ఎవ్వరి మనసు అంగీకరించదు.ఇదొక కల్ట్ క్లాసిక్ అని కూడా చెప్పాలి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

అన్నిటికీ మించి మహేష్ నటన ఎస్సెట్ అని చెప్పాలి. మహేష్ హీరోయిజానికి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద హైలెట్. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత కూడా ఇలాంటి సినిమా ఎందుకు తీయలేకపోయానే అని బాధపడినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus