సినిమా ప్రపంచంలో క్రేజ్ అందుకోవడం అంత సాధారణమైన విషయం కాదని చెబుతోంది బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య. అంతే కాకుండా మన ఇష్టంగా ప్రయత్నం చేస్తే ప్రతిఫలం దక్కకుండా ఉండదని కూడా అంటోంది. గతంలో ఈ బ్యూటీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. బిగ్ బాస్ 4 తెలుగులో కంటెస్టెంట్ గా ఉన్నప్పటికీ ఆమె ఎక్కువరోజులు ఉండలేదు. తన అమాయకత్వంతో గుడ్ గర్ల్ గానే హౌజ్ నుంచి తొందరగా బయటకు వచ్చేసింది.
ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఆమె గురించి మాట్లాడాడో అప్పటి నుంచి దివి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే కాకుండా ఇటీవల టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ (టీవీ) – 2020 టైటిల్ ను కూడా అందుకుంది. అయితే తనకు ఈ స్థాయిలో ఇంత త్వరగా క్రేజ్ అందుతుందని ఊహించలేదని దివి తెలిపింది.ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దివి తన కెరీర్ స్ట్రగుల్ గురించి వివరణ ఇచ్చింది. అవకాశాల కోసం దాదాపు 100కు పైగా ఆడిషన్స్ లో పాల్గొన్నాను.
ఎన్నో ఆఫీస్ ల చుట్టూ తిరిగాను. కానీ అందరూ రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. కానీ నేను నిరాశ చెందకుండా నా ప్రయత్నాలు నేను చేశాను. ఇప్పుడిప్పుడే కష్టానికి తగ్గట్లుగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. మరో మూడు నెలల్లో స్టార్ట్ కాబోయే మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు మరికొన్ని పెద్ద సినిమాల్లో నటిస్తున్నట్లు దివి వివరణ ఇచ్చింది.