కారు ప్రమాదంలో గాయపడిన హీరోయిన్!

బాలీవుడ్‌ మూవీ ‘స్వదేశ్‌’ లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్‌ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ ఎక్స్‌పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలhవుతోంది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్‌ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్‌కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు.

వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం (Gayatri Joshi) గాయత్రి, వికాస్‌ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్‌గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ ‘ఝంజరియా, జగ్జిత్ సింగ్ ‘కాఘజ్ కి కష్టి’తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది.

అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘స్వేడ్స్’లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ని పెళ్లాడి సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus