గ్యాప్ లేకుండా షూటింగ్ చేయడం వల్ల హీరోయిన్ కు గుండెపోటు

గ్యాప్ లేకుండా షూటింగ్‌ లో పాల్గొన్న కారణంగా బీపీ తగ్గి.. హార్ట్‌ఎటాక్‌ కు గురైంది ..ప్రముఖ మోడల్, నటి అయిన గెహానా. ప్రస్తుతం ఈమె పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది. గురువారం (నవంబర్ 21న) నాడు ఆమెకి గుండెపోటు రావడంతో వెంటనే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఓ వెబ్ సిరీస్ కోసం రెండు రోజుల పాటు విశ్రాంతి లేకుండా షూటింగ్ చేయడం వలనే ఇలా జరిగిందని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

ఆహరం తీసుకోకుండా కేవలం డ్రింక్స్ తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొనడంతో బీపీ తగ్గి ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇంకా ఈమె పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈమెని వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారట. హాస్పిటల్ కు తీసుకొచ్చే సమయానికే ఆమె నాడీ కొట్టుకోవడం ఆగిపోయిందనట. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ ద్వారా గుండె కొట్టుకునేలా చేశారట వైద్యులు. ప్రస్తుతం ఈమెకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందట. హీరోయిన్ గెహానాను బ్రతికించడానికి వారు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈమెకి షుగర్ కూడా ఉండడం, ఆహారం తీసుకోకుండా ఉండడం వలన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం కూడా ఇందుకు కారణమైందని తెలుపుతున్నారు. ‘ప్రేమించు పెళ్లాడు’, ‘నమస్తే’, ‘ఐదు’, ‘బీటెక్ లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో గేహనా నటించింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus