నటి హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకి భారీ ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం తల్లి, కూతురు సురక్షితంగా ఉన్నారని.. సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో హరితేజ గర్భం దాల్చింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నానంటూ అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్ తో దిగిన ఫోటోషూట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంది.
ఇక ఈమె కెరీర్ విషయానికొస్తే.. హరితేజ ‘మనసు మమత’, ‘రక్త సంబంధం’, ‘అభిషేకం’ లాంటి పాపులర్ తెలుగు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత వెండితెరపై కూడా అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తన పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షోకి హరితేజ స్పెషల్ ఎట్రాక్షన్ అయింది.
తన హరికథలతో హౌస్ మేట్స్ ని, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత అమ్మడు క్రేజ్ పెరగడంతో పలు టీవీ షోలతో బిజీగా గడిపింది. రీసెంట్ గా విడుదలైన ‘అల్లుడు అదుర్స్’, ‘జాంబీ రెడ్డి’ చిత్రాల్లో హరితేజ కనిపించింది.