Paradise: అందరూ యాడ్ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్ డిలీట్ చేశారు
- October 21, 2026 / 01:00 PM ISTByFilmy Focus Desk
హిందీలో అయితే అన్ దేఖా వెర్షన్.. తెలుగు సినిమాలో అయితే ఎక్స్టెండెడ్ వెర్షన్. గత కొన్నేళ్లుగా ఓటీటీల్లోకి తమ సినిమాలు వచ్చినప్పుడు మన సినిమా పరిశ్రమలు ఇలానే చేస్తున్నాయి. థియేటర్లోకి సినిమా వచ్చినప్పుడు తీసేసిన సన్నివేశాలను యాడ్ చేసి నిడివిని పెంచి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అంతకుముందు ఈ సీన్లను యూట్యూబ్‌లో రిలీజ్ చేసేవారు మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇలాంటి కాలంలో ఉంటూ తమ సినిమాలో సీన్స్ కలపకపోగా.. ఉన్నవి డిలీట్ చేసేశారట ‘ప్యారడైజ్’ డుయో నాని – శ్రీకాంత్ ఓదెల.
Paradise
అవును, ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 22 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్కి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను పంచుకుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్కి తీసుకొస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్టైమ్తో పోలిస్తే ఓటీటీలో నిడివి తగ్గింది. థియేటర్లో 2 గంటలా 54 నిమిషాలు ఉండగా, ఓటీటీలో 2 గంటల 30 నిమిషాల సినిమా మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.

ఈ లెక్కన సినిమాలో 24 నిమిషాల సీన్స్ తీసేశారు మితిమీరిన రక్తపాతం ఉన్న సన్నివేశాలు, కథ గమనానికి అడ్డుపడుతున్న సన్నివేశాలను తొలగించినట్లు ప్రాథమిక సమాచారం. దీని వల్ల కుటుంబ ప్రేక్షకులు సినిమాను చూసేందుకు అనువుగా ఉంటుందని చిత్ర బృందం భావించిందని సమాచారం. మరి ఏ సీన్స్ తీసేశారు, అవి సినిమాకు ఎంతగా ఉపయోగపడతాయి అనేది చూడాలి. అయితే ఇక్కడే ఇంకో మాట వినిపిస్తోంది. ఓటీటీలో ట్రోల్ అవుతాయనుకున్న సీన్స్‌ని లేపేశారు అనే మాట కూడా వినిపిస్తోంది.
జడల్ జమానా అంటే ఏంటో చూపిస్తా.. శిఖంజా మాలిక్‌ను ఎదుర్కొని నా వాళ్లకు ఓ గుర్తింపు ఇస్తా అంటూ వచ్చిన నాని ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. కొన్ని మితిమీరిన సీన్స్, మరికొన్ని ప్రభావం లేని సన్నివేశాలతో థియేటర్లలో ఇబ్బంది పడ్డాడు.. ఇబ్బంది పెట్టాడు. మరిప్పుడు ఓటీటీకి వచ్చాక ట్రోలర్స్ ఎంతవరకు తమ పోస్టులకు పని చెబుతారో చూడాలి.















