నటి హరితేజ ప్రెగ్నెన్సీ వీడియో వైరల్!

బుల్లితెరపై పలు షోలు, యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరితేజ.. బిగ్ బాస్ షోతో తన పాపులారిటీ మరింత పెంచుకుంది. తెలుగులో ప్రారంభమైన మొదటి బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఆమె ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి పెర్ఫార్మన్స్ కూడా కనబరిచింది. హరితేజ చెప్పిన బుర్రకథ షోకి హైలైట్ గా నిలిచింది. టైటిల్ గెలవడం కోసం సీజన్ చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత హరితేజకి అవకాశాలు మరింతగా పెరిగాయి.

కొన్ని షోలకు హోస్ట్ గా మారింది. అలానే కొన్ని సినీ అవకాశాలు కూడా దక్కాయి. నాలుగేళ్ల క్రితం హరితేజ దీపక్ రావు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని హరితేజ స్వయంగా వెల్లడించింది. తాను గర్భవతిని అయ్యానంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ముద్దు పెట్టుకొంటూ డ్యాన్స్ చేసింది. తన గర్బాన్ని చూసుకొంటూ మురిసిపోయింది. ఈ వీడియోలో హరితేజ ఎంతో ఆనందంగా కనిపించింది.

ఈ వీడియో చూసిన అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు చెప్పారు. అయితే కాసేపటికే ఆమె ఇన్స్టాగ్రామ్ నుండి ఈ వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే స్క్రీన్ షాట్లు తీయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హరితేజ కొంతకాలంగా సినిమాలకు, సీరియల్స్ కి దూరంగా ఉంటున్నారు.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus