టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఈమె దేవదాసు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా ఈమె ఒకానొక సమయంలో చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించినటువంటి ఇలియానాకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఒక్కసారిగా తాను అమ్మను కాబోతున్నాననే విషయాన్ని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు పెళ్లి కాకుండా అమ్మ కావడమేంటి అంటూ అందరూ షాక్ అయ్యారు. అయితే ఈమె రహస్యంగా వివాహం చేసుకున్న విషయాన్ని ఎవరికి తెలియచేయలేదు. ఇక తనకు బాబు పుట్టిన తర్వాత తన భర్త మైకల్ డోలన్ ను అందరికీ పరిచయం చేశారు. కానీ ఎక్కడా కూడా తన భర్త గురించి ఈమె మాట్లాడలేదు
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇలియానా మొదటి సారి తన భర్త గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ నేను బాబు పుట్టిన తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. ఇలా డిప్రెషన్ లోకి వెళ్లినటువంటి తాను ఒక గదిలో కూర్చుని ఒంటరిగా ఏడ్చేదానినని అలాంటి సమయంలో మైకేల్ డోలన్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారని తెలిపారు.
నేను బాబును చూసుకుంటూ ఉండగా తను మాత్రం నన్ను రెస్ట్ తీసుకోమని చెబుతూ బాబు ఆలనా పాలన తానే చూసుకొనేవారని అలాంటి మంచి వ్యక్తి నా జీవిత భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ మొదటిసారి తన భర్త మైఖేల్ గురించి (ileana) ఇలియానా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.