మొన్నామధ్య ట్రోలింగ్ దయ వల్ల ఓ జంట బాగా పాపులర్ అయ్యింది. పెళ్లి చేసుకుని ఇండియా వైడ్ ట్రోలింగ్ తో ట్రెండ్ అయిన ఆ జంట ఎవరో అందరికీ తెలుసు. వాళ్ళే రవీందర్ – మహాలక్ష్మీ. ప్రముఖ నిర్మాత అయిన రవీందర్ తన సినిమాలో నటిస్తున్న ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన మహాలక్ష్మీని.. పెళ్లి చేసుకున్నాడు. అయితే రవీందర్ భారీ కాయంతో ఉండటం.. మహాలక్ష్మీ సన్నగా అందంగా ఉండటంతో .. ఈ జంట పై ట్రోలింగ్ జరిగింది.
కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మీ … రవీందర్ ను పెళ్లి చేసుకుంది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఏది ఏమైనా ఆ ట్రోలింగ్ వల్ల వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. బోలెడన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే వీరి బంధం గురించి మరీ ముఖ్యంగా మహాలక్ష్మీ గురించి.. ప్రముఖ నటుడు ఈశ్వర్ రఘునాథ్ భార్య జయశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది. జయశ్రీ కూడా ఓ నటి, అలాగే డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా.! ఇక ఈమె తన భర్త రఘునాథ్ అరెస్ట్ గురించి గతంలో ఈమె మాట్లాడుతూ..” కొన్ని నెలలుగా మహాలక్ష్మితో ఇతను రిలేషన్‌లో ఉన్నాడు.
నా ముందే ఆమెకు వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడు. అంతేకాడు మహాలక్ష్మికి అనిల్ అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆ పిల్లాడు.. నా భర్తను నాన్న అని పిలుస్తున్నాడు. అంతేకాదు కొంత కాలంగా విడాకులు ఇవ్వాలని నన్ను వేధించాడు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే జయశ్రీ కామెంట్స్ ను మహాలక్ష్మీ ఖండించింది. ‘జయశ్రీ నా జీవితంలో చాలా ఇబ్బందులకు గురిచేసింది.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రవీందర్ నాకు మేలు చేశాడు. ఆయన వల్లే ఆ సమస్యల నుండి బయటపడగలిగాను” అంటూ మహాలక్ష్మీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక ‘డబ్బు కోసం అయితే నేను రవీందర్ ను పెళ్లి చేసుకోలేదు. నేను 3 నెలలకు లక్ష రూపాయలు సంపాదిస్తాను. నాకు డబ్బుతో అంత అవసరం లేదు. రవీందర్.. నేను ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం’ అంటూ తెలిపింది మహాలక్ష్మీ.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?