రామ్ చరణ్ – సుకుమార్ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నా.. అవి ప్రాజెక్ట్ ఉందా? లేదా? ఎలాంటి కథతో వస్తారు అనే మాటలు మాత్రమే వచ్చాయి. ఫర్ ది ఫస్ట్ టైమ్ సినిమా మెయిన్ కాస్టింగ్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఉండొచ్చు అనే టాపిక్ ఒకటి ఇప్పుడు డిస్కషన్‌లోకి వచ్చింది. అదే హీరోయిన్. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతుంది అని చెబుతున్న ఈ సినిమా కథానాయికగా ఎన్టీఆర్ హీరోయిన్‌ని తీసుకుంటున్నారు అనేది లేటెస్ట్ చర్చ.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణీ వసంత్‌ను చరణ్ సినిమా కోసం సుకుమార్ తీసుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ డిస్కషన్ ప్రాథమిక దశలోనే ఉందని.. త్వరలో చరణ్‌తో కలిపి ఫొటో షూట్ చేస్తారని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆమెతోపాటు మరికొంత మంది పేర్లు కూడా అనుకుంటున్నారని సినిమా వర్గాల సమాచారం.
‘దేవర’ సినిమాలో నటించిన జాన్వీ కపూర్‌ను ఆ తర్వాత ‘పెద్ది’ సినిమా కోసం తీసుకున్నాడు రామ్‌చరణ్. ఆమె ఇచ్చిన విజయం పక్కన పెడితే.. ఆ పాత్ర చిత్రణ వల్ల చిత్రబృందం నానా మాటలు పడింది. ఎప్పుడూ ఇలాంటి పాత్ర తెలుగు సినిమాలో చూడనట్టుగా ఏదేదో అనేశారు. దీని వల్ల మానసిక ప్రశాంతత కరువైంది. మరిప్పుడు ఎన్టీఆర్ సినిమా నుండి తీసుకుంటున్న మరో హీరోయిన్ విజయాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందేమో చూడాలి.
ఇక ఈ సినిమా గురించి వస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే భారీ యాక్షన్ మాస్ సినిమాగా రూపొందనుంది. ‘రంగస్థలం’ సినిమా తరహా ఎలాంటి ప్రయోగాలు ఉండవు అని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్ ఇప్పటికే షూట్ చేశారు. ఆ వీడియోతోనే ఇప్పుడు సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.