కొత్త హీరోయిన్ మీద పగబట్టిన హీరోయిన్లు?

ఒక్క సినిమాలో చాన్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భామలున్న ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఊహించని విధంగా అవకాశాలను కొట్టేస్తుంది. అందుకే మిగతా భామలందరు ఆమె మీద గుస్సుగా ఉన్నారు. తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే రెండు సినిమాలను చేజిక్కించుకున్న భామ ఇప్పుడు కోలీవుడ్లో కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. ఇంతకీ ఎవరా భామా.. అంటే ఇంకెవరు ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అనేస్తున్నారు.
 తెలుగులో త్రివిక్రం దర్శకత్వంలో ‘అ..ఆ’ సినిమా చేస్తున్న ఈ అమ్మడు తమిళ్ సినిమా ‘ప్రేమం’ రీమేక్ అయిన ‘మజ్ను’ లో కూడా తన పాత్రకు తానే న్యాయం చేస్తుందని సెలెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమా ఆఫర్ కూడా లైన్లో ఉందని వినికిడి. అయితే ఇదిలా ఉంటే కోలీవుడ్ నుండి  ఈమెకు భారీ ఆఫర్ వచ్చిందంటా  స్టార్ హీరో ధనుష్ సినిమా ‘కోడి’లో అవకాశం దక్కించుకుందట అనుపమ. ముందు ఈ పాత్రకు షామిలీని అనుకున్నా ఆమెను కాదని ఇప్పుడు ఈ ఆఫర్ అనుపమకు ఇస్తున్నట్టు కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవకుండా అమ్మడు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. అమ్మడు దక్కించుకుంటున్న సినిమా ఆఫర్లను చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లు కోవడం ఖాయం.ఈ భామ సైన్ చేసిన సినిమాలన్నీ ఏమేరకు ఆడతాయో వేచి చూడాల్సిందే!
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus