Kajal Aggarwal: ‘ఆచార్య’ లో తన పాత్రని డిలీట్ చేయడం పై స్పందించిన కాజల్.!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) – రాంచరణ్ (Ram Charan) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో రూపొందిన ‘ఆచార్య’ (Acharya) సినిమాని మెగా అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ తర్వాత కూడా చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ఆచార్య’ లో చిరు సరసన హీరోయిన్ గా మొదట కాజల్ అగర్వాల్ ను (Kajal Aggarwal) ఎంపిక చేసుకున్నారు. షూటింగ్లో కూడా కాజల్ పాల్గొంది. అయితే రిలీజ్ టైంకి కాజల్ ట్రాక్ ను తీసేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత ఈ విషయం గురించి కాజల్ స్పందించింది లేదు. అయితే ‘సత్యభామ’ (Satyabhama) ప్రమోషన్స్ లో కాజల్ కి ‘ఆచార్య’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఇబ్బంది పడుతూనే సమాధానం ఇచ్చింది. ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలో మీ రోల్ ని ఎడిటింగ్ లో తీసేయడం అనేది మీకు ఎలా అనిపించింది?’ అంటూ ఓ రిపోర్టర్ కాజల్ ను ప్రశ్నించాడు. ఇందుకు ఆమె “ఇట్స్ ఓకే..!ఒక్కోసారి మనం కొన్ని గెలుస్తాం. ఇంకొన్నిసార్లు మనం కొన్ని పోగొట్టుకుంటాం.

దానినే తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే మనకు ఏమొస్తుంది. ‘ఆచార్య’ విషయంలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో నాకు తెలియదు. నిజంగా నా వరకు కారణం ఏంటి అనేది రాలేదు. దాని గురించి తెలుసుకోవాలని కూడా నేను ప్రయత్నించలేదు. నేను ఆ విషయాన్ని ఎప్పుడో నా మైండ్లో నుండీ డిలీట్ చేసేశాను” అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే ‘ఇండియన్ 2 ‘ (Indian2) లో కూడా మీ పాత్ర ఉండదు అంటున్నారు?’ అని మరో రిపోర్టర్ కాజల్ ని ప్రశ్నించగా..

అందుకు ఆమె ‘ ‘ఇండియన్ 3′ లో నా పాత్ర ఉంటుంది చూడండి’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక కాజల్ నటించిన ‘సత్యభామ’ సినిమా జూన్ 7 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus