Kajal: కాజల్ తన భర్తను ప్రేమగా ఏమని పిలుస్తుందో మీకు తెలుసా?

  • May 21, 2024 / 07:16 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా అంతకంతకూ బిజీ అవుతున్నారు. సత్యభామ (Kajal’s Satyabhama)  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కాజల్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నేను నా భర్తను సామి అని పిలుస్తానని నా భర్త నన్ను కన్నా అని పిలుస్తారని కాజల్ వెల్లడించడం గమనార్హం. ఈ రెండు పేర్లు తెలుగులో పాపులర్ పేర్లు కావడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

కాజల్ గౌతమ్ కిచ్లూ కలకాలం సంతోషంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాజల్ గౌతమ్ క్యూట్ కపుల్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొడుకు పుట్టిన రెండు నెలలకే నేను హార్స్ రైడింగ్ కోసం వెళ్లాల్సి వచ్చిందని కాజల్ తెలిపారు. ఆ సమయంలో నేను చాలా బాధను అనుభవించానని ఆమె పేర్కొన్నారు.

ఎంత కష్టం ఎదురైనా ఆ సమయంలో నన్ను నేను బిల్డ్ చేసుకున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఇండియన్2 (Indian 2) నేను కచ్చితంగా చేయాలనుకున్నానని శంకర్ (Shankar) సార్ నుంచి కూడా సపోర్ట్ లభించిందని ఆమె వెల్లడించారు. శంకర్ సార్ ధైర్యం చెప్పడంతో కష్టాన్ని సైతం ఇష్టంగా మార్చుకుని సినిమా కోసం పని చేశానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

కాజల్ సత్యభామ ప్రాజెక్ట్ తో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. కాజల్ సత్యభామ సినిమాతో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాజల్ అగర్వాల్ వయస్సు పెరుగుతున్నా ఇతర భాషల్లో సైతం ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ప్రభాస్ (Prabhas) , ఎన్టీఆర్ (Jr NTR)  మరి కొందరు హీరోలకు కాజల్ లక్కీ హీరోయిన్ అని ఫ్యాన్స్ భావిస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus