Tamannah: లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) .. 17 ఏళ్లుగా స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది. హీరోయిన్లు ఇంతకాలం నెట్టుకురావడం అంటే మాటలు కాదు. తమన్నా తెలివితేటలు అలాంటివి. ఈమె నటించిన సినిమాల్లో హిట్లు కంటే ప్లాప్స్ ఎక్కువ.పైగా చేసినవన్నీ గ్లామర్ రోల్సే. అయినా ‘తమన్నా ఎలా ఇంతకాలం స్టార్ గా రాణిస్తుంది?’ అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఈమె సెట్ లో ఉండే విధానం అలా ఉంటుంది. టైంకి సెట్స్ కి రావడం.. తన రోల్ పై ఉండే డైలాగ్స్ కి ప్రిపేర్ అవ్వడం, సింగిల్ షాట్ లో సీన్ ఫినిష్ చేయడం ఈమె స్టైల్.

రాజమౌళి (S. S. Rajamouli) , సుకుమార్ (Sukumar) ..లు సైతం ఈమె డెడికేషన్ కి ఇంప్రెస్ అయిపోయి ప్రశంసలు కురిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాదు తోటి నటీనటులను కంఫర్ట్ గా ఉన్నారా లేదా అనే విషయాలు కూడా ఈమె బాగా చెక్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్నా… మొన్నామధ్య ‘జీ ఖర్దా’ ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి వెబ్ సిరీస్..లలో బోల్డ్ గా నటించింది.

ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఫిమేల్ ఆర్టిస్ట్..ల కంటే కూడా మేల్ ఆర్టిస్ట్..లకే కష్టం అని ఇటీవల ఓ సందర్భంలో ఈమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఫిమేల్ ఆర్టిస్ట్ ..లు మినిమమ్ ఇబ్బంది పడినా.. సీన్స్ సరిగ్గా రావట. అందుకే వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారా? లేదా? అనే విషయాన్ని మేల్ ఆర్టిస్ట్..లు చెక్ చేసుకోకపోతే.. చాలా ఇబ్బంది పడతారు అని తమన్నా చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus