Hema: ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ

బెంగుళూరు శివారు ప్రాంతంలో ఓప్రముఖ వ్యాపవేత్తకి చెందిన ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఫామ్ హౌస్ పై రైడ్ చేయగా 100 మంది వరకు దొరికినట్టు సమాచారం.ఇందులో టాలీవుడ్ కి చెందిన నటీనటులు, మోడల్స్ .. అలాగే పలువురు సినీ ప్రముఖులు ఉన్నారని వార్తలు వచ్చాయి. టాలీవుడ్ నటులు హేమ (Hema)  , సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth) వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నట్టు టాక్ నడిచింది.

అయితే ఈ విషయం బయటకు వచ్చిన కొంతసేపటికే.. ‘నటి హేమ , తాను హైదరాబాద్లో ఉన్న తన ఫామ్ హౌస్ లో ఉన్నానని.. బెంగళూరులో తన ప్లేస్లో పట్టుబడిన వ్యక్తి ఎవరో తనకు తెలీదని, ఈ కేసులో తనని అనవసరంగా ఇరికిస్తున్నారని’ ఆమె చెప్పుకొచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో నిజంగానే హేమ.. తప్పేమీ లేదేమో అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత బెంగళూరు పోలీసులు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు.

‘తమకు పట్టుబడ్డ వారిలో సినీ నటి హేమ కూడా ఉందని. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె హెయిర్ సాంపుల్స్ వంటివి తీసుకుని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించామని’ చెప్పి పెద్ద షాకిచ్చారు. అంతేకాదు తాము పట్టుకున్న టైంలో తీసిన హేమ ఫోటోని కూడా వారు విడుదల చేశారు. ఇక ఉదయం హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్..

పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోని డ్రెస్ సేమ్ ఉండటం గమనార్హం. అంతేకాదు.. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి అందరినీ మిస్ లీడ్ చేసిన కారణంగా హేమ పై ఇంకో కేసు నమోదు చేశారట బెంగళూరు పోలీసులు. ఈ రకంగా ఆమె మళ్ళీ చిక్కుల్లో పడినట్టు అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags