Kajal: మహేష్, చరణ్ .. లతో పాటు కాజల్ కూడా ఆ లిస్ట్ లోకి చేరింది!

  • November 6, 2023 / 09:42 AM IST

2020 లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజల్. పెళ్ళైనా సినిమాలు చేయడానికి ఆమె భర్త పర్మిషన్ ఇచ్చాడు. అయితే 2022 టైంలో కాజల్ ప్రెగ్నెంట్ అయ్యింది. తర్వాత ఓ బాబుకి జన్మించిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెంట్ అయిన టైంలో ఆమె కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల వచ్చిన ‘భగవంత్ కేసరి’ తో ఓ రకంగా ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది అని చెప్పాలి.

ఇక నుండి కాజల్ (Kajal) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని చూస్తుంది. ఆమె లీడ్ రోల్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. కానీ ఇంకా 60 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది అని ఇన్సైడ్. అయితే ‘సత్యభామ’ టీజర్ దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ కాబోతుందట.

‘అవురమ్ ఆర్ట్స్’ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ ఫేమ్ శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ అందిస్తున్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. ఇక ఈ టీజర్ అప్డేట్ తో కాజల్ కూడా దీపావళి రేస్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే దీపావళి కానుకగా తెలుగు సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు కానీ.. మహేష్ ‘గుంటూరు కారం’ మొదటి పాట, రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ మొదటి పాట, రవితేజ ఈగల్ టీజర్ వంటివి రిలీజ్ కాబోతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus