ఆమె చివరి మాటే నిజమయింది..!

‘ఊపిరి’లో నాగ్ ఇంటి వంట మనిషిగా నటించిన కల్పన తమిళంలోనూ చాలా సినిమాలు చేసింది. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఐతే ‘ఊపిరి’ సినిమాలో నటిస్తుండగానే కల్పన హఠాత్తుగా చనిపోయింది. ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున ఓ సన్నివేశంలో తనకిష్టమైన వంటకం చేసిపెట్టమని ఆమెను అడుగుతాడు. చాలా ఏళ్ల తర్వాత అలా అడగడంతో చకచకా వంట గదికి వెళ్లి ఆ పనిలో పడుతుంది. ఆ సందర్భంలో.. ‘త్వరగా అమ్మా.. నాకు పెద్దగా టైం లేదు’’ అంటుంది కల్పన. దురదృష్టవశాత్తూ ఆమె మాటలు నిజమైపోయాయి. కార్తితో పాటు ‘ఊపిరి’ సినిమాలో నటించిన అందరూ కల్పన విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. నాగ్ కూడా తమిళ వెర్షన్ సక్సెస్ మీట్లో కల్పనను గుర్తు చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus