షార్ట్స్ వేసుకున్న నటి.. మండిపడుతోన్న నెటిజన్లు!

ఒకప్పుడు తెలుగులో ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కనిక ఆ తరువాత టాలీవుడ్ కి దూరమై తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారారు. ఈమె వయసు 38 ఏళ్లు. అయినప్పటికీ గ్లామరస్ గా కనిపించడానికే ఇష్టపడతారు. పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తన శరీరాకృతిని కాపాడుకుంటూ ఇప్పటికీ అందంగానే కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటారు.

రీసెంట్ గా ఈమె షార్ట్స్ వేసుకొని ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ వయసులో ఇలా కనిపించడం అవసరమా..? ఓ బిడ్డకు తల్లివి అయి ఉండి ఇలాంటి బట్టలు వేసుకోవడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేశారు. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. అయితే ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు కనిక.

తానొక బిడ్డకు తల్లినే అయినప్పటికీ షార్ట్స్ వేసుకుంటానని అన్నారు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతానని.. జీవితాన్ని అనుభవించడానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తానని.. అదే సమయంలో తన కొడుకు, కుటుంబాన్ని ప్రేమిస్తానని అన్నారు. తల్లి అంటే ఇలానే ఉండాలని ఏమైనా నిబంధనలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. వేసుకునే బట్టలను చూసి అమ్మతనాన్ని జడ్జి చేయొద్దంటూ ధీటుగా బదులిచ్చింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus