తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అని తేడాలేకుండా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో కలిసి నటించిన కస్తూరి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో ఆమె నాగార్జున జోడిగా రమ్యకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా కూడా తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం ఆ సీరియల్ కార్తీక దీపంకు కూడా పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ఇక పలు ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చిన కస్తూరి రీసెంట్ గా ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ గేమ్ షో లో కూడా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కూతురు విషయంలో దాదాపు మూడేళ్ళ పాటు నరకయాతన అనుభవించి చావును కూడా దగ్గరగా చూసినట్లు తెలిపింది. తన కూతురు లుకేమియా వ్యాధితో బాధ పడిందని ఆ సమయంలో తను చాలా డిప్రెషన్ కు గురైనట్లు తెలిపింది. కూతురు ఆరోగ్యం కోసం కొడుకును కూడా ఎక్కువగా పట్టించుకోలేదని కంటతడి పెట్టారు.
మూడేళ్ల పోరాటం అనంతరం తన కూతురు ఆ వ్యాధి నుంచి బయట పడిందని ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఆ బాధ నుంచి కోలుకున్న తరువాత ముఖ్యంగా లుకేమియాతో బాధపడే వారికి తన వంతు సహాయంగా చేయాలని ఒక ట్రస్ట్ ను కూడా స్థాపించాను. నాకు కారు బంగ్లా ఆస్తులు ఏది అవసరం లేదు. లుకేమియా తో బాధపడుతున్న వారికి వీలైనంత వరకు సహాయం చేయడానికి ఒక టార్గెట్ చేసుకున్నట్లు వివరణ ఇచ్చింది.