ఇటీవల ‘ఇండియన్ 2’ సెట్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇక ‘ఇండియన్ 2’ చిత్ర యూనిట్ సభ్యులైతే చాలా విచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా హీరో కమల్ ను అలాగే దర్శకుడు శంకర్ ను విచారణ చేశారు. తాజాగా కాజల్ కు కూడా సమన్లు పంపారు పోలీసులు.
అయితే కమల్ వంటి పెద్ద వ్యక్తిని 3 గంటల పాటు విచారించడం ఏంటి? జరిగిన ఘటనకు ఆయనకి సంబంధం ఏమిటి అని కమల్ పార్టీ నేతలు ప్రకటనలు విడుదల చేశారు. ఈ విషయం పై సీనియర్ నటి కస్తూరి జోక్యం చేసుకుని సెటైర్లు వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘కమల్ ఓ 3 గంటల సేపు కూడా కూర్చోలేరా? కమల్ విచారించడంతో తప్పేంటి? ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల కమల్ హాసన్ పరువు తీసినట్టు అవుతుంది’.. అంటూ కమల్ పై సెటైర్లు వేసింది సీనియర్ నటి కస్తూరి. ‘ఈ మధ్య కాలంలో ఈమె సందు దొరికితే చాలు అందరి పై సెటైర్లు వేయడానికి రెడీ అయిపోతుంది’.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!