Kasthuri Shankar: వ్యక్తిపై మూత్రం పోసిన యువకుడు… ఆగ్రహం వ్యక్తం చేసిన నటి కస్తూరి!

Advertisement

నటి కస్తూరి శంకర్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఏదైనా తప్పు జరిగినట్టు కనక కనపడితే వెంటనే ఈమె ఆ ఘటనపై స్పందిస్తూ తన స్టైల్ లో తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు ఈమె చేసే పోస్టులు వివాదంగా మారుతూ ఉంటాయి. ఈ విధంగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన విషయాలు అలాగే సోషల్ మీడియాలో ఎంతో అభ్యంతరకరంగా అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోల పట్ల కూడా ఈమె స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మద్యం మత్తులో సిగరెట్ తాగుతూ మెట్లపై కూర్చున్నటువంటి వ్యక్తిపై స్థిమితం లేకుండా యూరిన్ పోశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో కాస్త కస్తూరి శంకర్ కంటపడటంతో ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో భాగంగా మద్యం మత్తులో ఊగుతూ, సిగరెట్ తాగుతూ పర్వేష్ శుక్లా అనే యువకుడు మెట్ల మీద కూర్చున్న యువకుడిపై మూత్రం పోశాడు. ఆ యువకుడు ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.

ఈ వీడియో చూసినటువంటి (Kasthuri Shankar) ఈమె కుక్కలు కూడా అలా చేయవు అంటూ మండిపడ్డారు. ప్రవేష్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు సన్నిహితుడని తెలుస్తోంది. ఆ నీచుడ్ని వెంటనే శిక్షిస్తారా లేక వదిలేస్తారా? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో తమిళనాడు బీజేపీ నేత చేసిన ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నా’ అంటూ ఈమె చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పోలీసుల వెంట పడటంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus