పవన్ కళ్యాణ్ ను స్టార్ హీరోయిన్ చేసిన చిత్రం ‘తొలిప్రేమ’. అప్పటికే అంచెలంచెలుగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్.. ఓ కొత్త డైరెక్టర్ తో.. కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు అంటే రిస్క్ అని చాలా మంది భావించారు. అంతేకాదు ‘తొలిప్రేమ’ కు ముందు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ పెద్ద డైరెక్టర్లతో చేసినవి..! ‘తొలిప్రేమ’ కు ఆ ప్లస్సులు లేవు. అయినా సరే 1998 లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభాలను అందించింది ఈ చిత్రం. ఇక ‘తొలిప్రేమ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి రెడ్డి. ఇందులో అను అనే పాత్రలో చాలా చక్కగా నటించింది. అప్పట్లో యువత ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి లవర్ గా కావాలని కోరుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ‘తొలిప్రేమ’ సక్సెస్ కీర్తి రెడ్డి స్టార్ హీరోయిన్ అవ్వడానికి అయితే సహాయపడలేదు. తర్వాత ఈమె చేసిన ‘ప్రేమించే మనసు’ ‘రావోయి చందమామ’ చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఈమెను పట్టించుకున్న వాళ్ళు లేరు.
కొంతకాలం తర్వాత మహేష్ బాబు – గుణశేఖర్ ల.. ‘అర్జున్’ సినిమాలో ఈమెను అక్క పాత్రకు తీసుకున్నారు. ఆ సినిమా యావరేజ్ గానే ఆడింది. అది కూడా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే తర్వాత ఈమె టాలీవుడ్ హీరో సుమంత్ ను పెళ్లి చేసుకోవడం.. కొంతకాలానికే విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈమె ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది.
అయితే ఇటీవల ఈమె ఓ ఫ్యామిలీ వెడ్డింగ్ కు హాజరైంది. ఈ వేడుకకు సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా హాజరైంది. అయితే ఈ పెళ్లి వేడుకలో కీర్తి రెడ్డి లుక్స్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఆమె మొహం పై ముడతలు వంటివి కనబడడం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు.