Rebels Of Thupakula Gudem Review: రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
February 3, 2023 / 04:20 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
ప్రవీణ్ కండెలా (Hero)
జయత్రి (Heroine)
శ్రీకాంత్ రాథోడ్, శివ రామ్ రెడ్డి, వంశీ ఊటుకూరు తదితరులు (Cast)
జైదీప్ విష్ణు (Director)
వారధి క్రియేషన్స్ (Producer)
మణిశర్మ (Music)
శ్రీకాంత్ అర్పుల (Cinematography)
Release Date : ఫిబ్రవరి 3, 2023
కంటెంట్ నచ్చితే, చిన్నా, పెద్దా.. తెలిసిన నటీనటులా?.. లేక, కొత్తవాళ్లా అనేది పట్టించుకోకుండా ఆదరిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు.. అందుకే వారిని ఆకట్టుకోవడానికి ఢిఫరెంట్ కాన్సెప్టులు రెడీ చేస్తున్నారు మేకర్స్. దాదాపు 40 మంది కొత్త ఆర్టిస్టులతో, వారధి క్రయేషన్స్ నిర్మాణంలో, జైదీప్ విష్ణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’.. మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ మూవీకి సంగీత మందించడంతో హైప్ క్రియేట్ అయింది. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ : ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ కథ మొత్తం తుపాకులగూడెం అనే ఊరు చుట్టూ తిరుగుతుంటుంది. 2009 ప్రాంతంలో నక్సలిజం సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తుంది. దాని ప్రకారం నక్సలైట్లు సరెండర్ అయితే వారికి మూడు లక్షల రూపాయల డబ్బు, పోలీసు ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. అలా నక్సలైట్ల పేరుతో ఏజెన్సీ ప్రాంతాల వ్యక్తులను సరెండర్ చేయడానికి ఒక బ్రోకర్ ప్లాన్ చేస్తాడు.
ఈ విషయాన్ని ఏజెన్సీ మొత్తం దొరలా ఫీలయ్యే రాజన్న దృష్టికి తీసుకువెళ్తే రాజన్న తన దగ్గర ఉండే కుమార్ అనే వ్యక్తికి ఈ పని అప్పగిస్తాడు. అయితే సర్కారు ఉద్యోగం ఫ్రీగా ఇవ్వలేమని మనిషికి లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెడతాడు బ్రోకర్. అలా వందమంది కలిసి కోటి రూపాయలు డబ్బు పోగుచేసుకుని సదరు బ్రోకర్‌కి ఇచ్చిన తర్వాత అతను మిస్ అవుతాడు.
ఈ 100 మంది గవర్నమెంట్‌కి లొంగిపోయి పోలీసులయ్యారా ? నిజంగా వాళ్లకు బ్రోకర్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించాడా? ఈ కథలో శివన్న పాత్ర ఏమిటి? ఊరి బాగు కోసం ప్రయత్నించిన క్రాంతి ఎవరు? మన్యం మొత్తం పెద్దదిక్కుగా భావించే రాజన్నకు, క్రాంతికి, శివన్నకు అసలు సంబంధం ఏంటి అనేది ఈ మిగతా కథ..
నటీనటుల పనితీరు : కొత్త ఆర్టిస్ట్ శ్రీకాంత్ రాథోడ్ కెమెరా ఫియర్ లేకుండా అనుభవమున్న నటుడిలా చేశాడు. పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అందరూ కొత్త వాళ్ల మధ్యలో కాస్త ప్రేక్షకులకు తెలిసిన ముఖం జయత్రి మాత్రమే. శ్రీకాంత్ రాథోడ్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మంచి నటన కనబర్చింది జయత్రి. ప్రవీణ్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. ఇతర నటీనటులంతా తమ క్యారెక్టర్లలో అలరించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : సంతోష్ మురారికర్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రివల్యూషనరీ పదాలు బాగున్నాయి. అలాగే సినిమాకు ప్లస్ అయ్యాయి. కెమెరామెన్ శ్రీకాంత్ అర్పుల విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన కెమెరా పనితనంతో గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. దర్శకుడు జైదీప్ విష్ణు ఎడిటింగ్ కూడా చేశారు. ఇక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన బాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేశారు.
ప్లజంట్ సాంగ్స్ ఇచ్చారాయన. వారధి క్రియేషన్స్ లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేయడం విశేషం. దర్శకుడు జైదీప్ విష్ణు.. నిరుద్యోగ యువత నక్సలిజం వైపు మళ్లడం.. వారిని సరెండర్ అవమని ప్రభుత్వం ప్రకటించడం వంటి అంశాలతో కథ రాసుకున్నారు. అనుకున్నట్టుగా చిత్రీకరించడంలో సఫలమయ్యాడనే చెప్పొచ్చు. కామెడీ, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేశాడు.
విశ్లేషణ : కొత్త నటీనటులు, కొంత మంది కొత్త టెక్నీషియన్స్ కలిసి చేసిన హానెస్ట్ అటెంప్ట్ ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నక్సలిజం చుట్టూ తిరిగే ఈ చిత్రం ఓ మంచి ప్రయత్నం.. చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు..