మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతిసనన్. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినప్పటికీ.. హీరోయిన్ గా కృతిసనన్ కు మంచి పేరే దక్కింది. దాంతో వెంటనే నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘దోచేయ్’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. కానీ ఆ చిత్రం కూడా ప్లాప్ అవ్వడంతో ఆమె టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ మాత్రం ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి.
వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లోనూ అలాగే కథాబలం ఉన్న చిత్రాల్లోనూ నటిస్తూ తన ఇమేజ్ ను మరింత బలోపేతం చేసుకుంటుంది కృతిసనన్. అటు తరువాత దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఈమె డేటింగ్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె కరోనా భారిన పడినట్టు సమాచారం. ఇటీవల ఈమె స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో కరోనా పరీక్షలు చేయించుకోగా..
రిపోర్ట్స్ లో ఈమెకు పాజిటివ్ అని తేలిందట. అయితే ఈ విషయాన్ని కృతి కన్ఫర్మ్ చెయ్యలేదు. ఒకవేళ ఈ వార్త నిజం కాకపోతే ఈమె స్పందించాలి కదా.. అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి అసలు నిజం ఏంటన్నది తెలియాల్సి ఉంది. కృతి సనన్ మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు కూడా కరోనా సోకినట్టు టాక్ వినిపిస్తుంది.