ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా.. సినిమాల్లో కనిపించకుండా.. ఫ్యామిలీతో గడుపుతున్న.. విదేశాల్లో సెటిల్ అయిన సెలబ్రిటీల గురించి తెలుసుకుంటున్నాం.. తెలుగమ్మాయి, నటి లయ గుర్తుందా?.. ‘స్వయంవరం’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, పక్కింటమ్మాయి తరహా క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించడే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ’ప్రేమించు‘ మూవీలో బ్లైండ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించి నంది అవార్డ్ అందుకుంది. తర్వాత జగపతి బాబుతో చేసిన ‘మనోహరం’ కూడా నందినందుకుంది.
హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉండగానే అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ శ్రీ గణేష్‌ను పెళ్లి చేసుకుంది విజయవాడ అమ్మాయి లయ. పెళ్లి తర్వాత భర్తతో పాటు అక్కడే స్థిర పడిపోయింది. వీరికి ఓ పాప, బాబు సంతానం. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తనలానే పిల్లలిద్దర్నీ బాలనటులుగా పరిచయం చేస్తూ.. తను కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది..సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన లయ.. అమెరికాలో సెటిల్ అయినా కానీ మన ట్రెడిషన్‌ని మర్చిపోలేదు.
భర్త, పిల్లలతో కలిసి ఇటీవల దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.. రీసెంట్గా లయ ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది.. ఆడవాళ్లకి ఐ ఫోన్ కంటే కూడా లిప్‌స్టిక్ అంటేనే ఇష్టమంటూ.. ఫ్రెండ్‌తో కలిసి లిప్‌స్టిక్ చోరీ చేస్తున్నట్లున్న ఈ సరదా వీడియో ట్రెండ్ అవుతోంది. ‘మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌కి రావచ్చు కదా మేడమ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..