మాట కోల్పోయి ఇబ్బంది పడుతున్న నటి.. ఆ వ్యాధి వల్లేనట..!

ఓ నటి చాలా రేర్ డిసీస్ తో బాధపడుతుంది. దాని వల్ల ఆల్రెడీ ఆమె మాట్లాడలేకపోతుంది. ఇంతకీ ఎవరా నటి? వివరాల్లోకి వెళితే.. శ్రీవాణి, ఈమె తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితమే. ‘చంద్రముఖి’ అనే సీరియల్‌లో అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అలాగే ‘మనసు మమత’, ‘కలవారి కోడలు’, ‘కాంచన గంగ’, ‘మావి చిగురు’, ‘ఘర్షణ’ వంటి సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు పలు యాడ్స్‌లో కూడా ఈమె మెరిసింది.

టీవీ షోలు, సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండేది శ్రీవాణి.ఎంతో చక్కగా.. అందరితోటి ఎంతో అన్యోన్యంగా కలిసి పోయే ఈమె ఈరోజు మాట్లాడలేకపోతుంది. ఈమె మాట్లాడే అదృష్టాన్ని కోల్పోవడానికి ఓ వ్యాధి కారణమట. ఈ విషయాన్ని ఆమె భర్త తెలియజేశాడు. అతను మాట్లాడుతూ… ‘మొదట దాన్ని జలుబు అనుకున్నాం. కొన్ని మందులు కూడా వాడాం.కానీ అది రోజురోజుకు పెరిగింది. గత వారం రోజుల నుండి ఆమెకు వాయిస్ రావడం లేదు. మాకు చాలా భయం వేసింది.

కానీ, ఏమీ కాదు డెఫినెట్‌గా మాట్లాడతావ్ అని ఆమెకు చెప్పాను.కానీ తనని చూస్తుంటే చాలా బాధగా ఉంది. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే.. గట్టిగా అరవడం కారణంగా గొంతు లోపలి టిష్షు వాపునకు గురైందని చెప్పాడు.కొన్ని మందులిచ్చాడు. ‘నెల రోజుల వరకు తను .. మాట్లాడడానికి ప్రయత్నించవద్దని చెప్పాడు. మాట్లాడితే సమస్య వస్తుందన్నాడు’. నెల తర్వాత ఆమె మళ్లీ నార్మల్‌ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని శ్రీవాణి భర్త తెలిపాడు. మరోపక్క ఆమె మళ్ళీ నార్మల్ గా మాట్లాడే రోజు రావాలి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక శ్రీవాణికి ఓ పాప కూడా ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus