Madhavi Latha: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాధవీ లత…. క్లారిటీ ఇచ్చిన నటి!

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అయితే తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఏకంగా 6 సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇలా ఏడవ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సీజన్ లో పాల్గొనబోయే కాంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి తరచూ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ ఉంటారు నటి మాధవి లత. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మాధవి లత కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై మాధవి లత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ అవకాశం రావడం ఇది మొదటిసారి కాదని తెలిపారు.

గత మూడు సీజన్ల లో వరుసగా నిర్వాహకులు తనని సంప్రదించి తనకు అవకాశం కల్పిస్తున్నారని తెలియజేశారు. అయితే ప్రతిసారి తాను ఈ అవకాశాన్ని తిరస్కరిస్తూ వస్తున్నానని ఈమె తెలిపారు. ఈసారి కూడా తనుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ అవకాశాన్ని కల్పించారని ఈమె తెలియజేశారు. అయితే వ్యక్తిగతంగా నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందుకే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు.

అయితే తనని ఇన్నిసార్లు సంప్రదించినందుకు బిగ్ బాస్ నిర్వాహకులకు ఈమె కృతజ్ఞతలు తెలిపారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాధవి లత (Madhavi Latha) క్లారిటీ ఇవ్వడంతో ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus