సోషల్ మీడియాలో హీరోయిన్లు గ్లామర్ ఫోటోలు వంటివి షేర్ చేసేది వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే. తమ ఫాలోవర్స్ ని ఆకర్షించే విధంగా ఫోజులు ఇచ్చి.. ఆ సంఖ్యని ఇంకా పెంచుకోవాలని.. తద్వారా కమర్షియల్ బెనిఫిట్స్ పొందాలనేది వారి అభిప్రాయం. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటారు. నటి మహిమా నంబియార్ (Mahima Nambiar) కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆమె నెటిజెన్లపై ఓ రేంజ్లో మండిపడుతూ పోస్టులు పెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. “కొన్ని రోజుల నుండి చూస్తున్నాను. కొంతమంది నా పేరుతో తప్పుడు వార్తలు, అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతున్నారు. అవి నా పరువుకు భంగం కల్పించే విధంగా ఉన్నాయి. అలాంటి వాటిని ఇప్పటివరకు సహిస్తూ వచ్చాను. ఇక సహించను. నేను మీ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుని నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. మీరు కూడా నన్ను అగౌరపరచొద్దు అని వేడుకుంటున్నాను.
నా ఈ రిక్వెస్ట్ ని తక్కువ చేసి చూసి ఎవరైనా హద్దులు దాటి నాపై అసత్య ప్రచారం చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇదే నా లాస్ట్ వార్నింగ్. ఇక హద్దులు దాటితే ఊరుకోను” అంటూ రాసుకొచ్చింది మహిమా నంబియార్ (Mahima Nambiar) . కమెడియన్ సూరి హీరోగా తెరకెక్కుతున్న ‘మందాడి’ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే టాలీవుడ్ నటుడు సుహాస్ కూడా ఇందులో నెగిటివ్ రోల్ పోషిస్తూండటం విశేషంగా చెప్పుకోవాలి.