Malavika: హాస్పిటల్ బెడ్ పై ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ మాళవిక.. వైరల్ అవుతున్న పోస్ట్’

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ కన్నడ సినిమా ఇన్ని అద్భుతాలు చేసిందా? అని ఆశ్చర్యపడేలా ఆ మూవీ రికార్డులు ఎన్నో.! ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ఇందులో ఆండ్రీ మాళవిక అవినాష్‌ ఒకరు. ‘ఇప్పుడేం చేస్తాడు మీ హీరో?’.. అనే డైలాగ్ వినపడింది అంటే టక్కున మైండ్లో ఈమె రూపమే మెదులుతుంది.

నిజానికి ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కథను మొత్తం నడిపించేది (Malavika) ఈమెనే..! ఈమె చాలా కన్నడ సినిమాల్లో, సీరియల్స్ లో నటించినప్పటికీ ‘కె.జి.ఎఫ్’ తెచ్చిపెట్టిన గుర్తింపు అసాధ్యమైనది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె హాస్పిటల్ పాలవ్వడం అందరినీ షాక్ కు గురిచేసింది. విషయంలోకి వెళితే.. మాళవిక గత కొంత కాలంగా మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతుంది. దీనివల్ల ఆమె మొహం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. హాస్పిటల్ బెడ్ పై ఈమె ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘ఎవరికైనా మైగ్రేన్‌ సమస్య ఉంటే.. దాన్ని తేలికగా తీసుకోవద్దు. మీరు అలా తేలికగా తీసుకుంటే నాలా హాస్పిటల్ బెడ్ పై చేరాల్సి వస్తుంది’ అంటూ ఈమె హెచ్చరిస్తుంది. ఇక ఆమె మైగ్రేన్‌ సమస్య నుండి బయటపడటం కోసం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకున్నానని తెలిపింది. దీంతో మాళవిక త్వరగా కోలుకోవాలని ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus