సీనియర్ హీరోయిన్ మణిచందన (Mani Chandana) తెలుగు ప్రేక్షకులకి ప్రేక్షకులకి సుపరిచితమే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఈ ఏడాది మణిచందన చాలా సినిమాల్లో కనిపించారు. గత 2 నెలల నుండి చూసుకుంటే.. ఆమె రవితేజ(Ravi Teja) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాలో ప్రభావతి అనే రోల్ చేశారు. అలాగే రాజ్ తరుణ్ (Raj Tarun) ‘భలే ఉన్నాడు’ (Bhale Unnade) సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర.. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్(Jr NTR) – కొరటాల శివ (Koratala Siva)..ల ‘దేవర’ (Devara) లో కూడా హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ..కి తల్లి పాత్ర చేసింది.
ఓ రకంగా ‘దేవర’ మొదటి భాగంలో హీరోయిన్ జాన్వీ కపూర్ కంటే.. మణిచందననే ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ఈమె పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగులు కట్ అయ్యాయట. ఇదిలా ఉండగా.. మణిచందన గతంలో హీరోయిన్ గా రవితేజ వంటి హీరోల సరసన చేసింది. ‘మనసిచ్చాను’ (Manasichanu) అనే సినిమాలో రవితేజకి హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత సుమన్ వంటి పలు హీరోల సినిమాల్లో మణిచందన హీరోయిన్ గా చేయడం జరిగింది.
తమిళంలో, కన్నడంలో రూపొందిన సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా చేసింది. ఒకానొక టైంలో బాలకృష్ణ (Balakrishna) సరసన ఈమె సోలో హీరోయిన్ చేసే ఛాన్స్ కూడా కొట్టిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మణిచందన ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. గతంలో బాలకృష్ణ – మణిచందన హీరో, హీరోయిన్లుగా ఓ సోసియో ఫాంటసీ మూవీ మొదలైందట. బి.గోపాల్ (B. Gopal) ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉందట. ఒకటి, రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిందట.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్టు ఆమె చెప్పుకొచ్చింది. పలు మ్యాగ్జైన్లలో ఈమె బాలకృష్ణతో ఉన్న స్టిల్స్ కూడా పబ్లిష్ అయ్యాయట. ఆ సినిమా కనుక కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయ్యి ఉంటే.. ఈమె కెరీర్ ఇంకోలా ఉండేదేమో..! ప్రస్తుతం మణిచందన అల్లరి నరేష్ (Allari Naresh) ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) వంటి పలు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నట్టు చెప్పుకొచ్చింది.