Viswam: ‘విశ్వం’ లో సెన్సార్ కి బలైన 14 సన్నివేశాలు ఇవేనట..!

కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకు.. ‘ఇది కేవలం కల్పితం’ అనే నోట్ ను 5 సెకన్ల పాటు ప్లే చేస్తారట.గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా తెరకెక్కింది. మరో 3 రోజుల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘చిత్రాలయం స్టూడియోస్’ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. గోపీచంద్ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘భీమా’ (Bhimaa) కూడా సో సో గానే ఆడింది. మరోపక్క దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఫామ్లో లేడు. ‘ఆగడు’ (Aagadu) ‘బ్రూస్ లీ’ (Bruce Lee) ‘మిస్టర్’ (Mister) ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో రేసులో చాలా వెనుకబడ్డాడు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) నటించిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్టు లేదు. అందుకే ‘విశ్వం’ సక్సెస్ వీరందరికీ చాలా కీలకంగా మారింది. విడుదలైన టీజర్, ట్రైలర్.. వంటివి పర్వాలేదు అనిపించాయి. సో సినిమాపై కొంత బజ్ అయితే ఏర్పడింది అని చెప్పాలి.

అక్టోబర్ 11న ‘దసరా’ కానుకగా విడుదల కాబోతున్న ‘విశ్వం’ (Viswam) సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ‘విశ్వం’ చిత్రానికి సంబంధించి సెన్సార్ వారు చాలా కట్స్ చెప్పారట. శ్రీను వైట్ల సినిమాలు అంటే కలర్ఫుల్ గా ఉంటాయి. ఇప్పటివరకు వయొలెన్స్ శృతిమించిన సందర్భాలు అంటూ ఎక్కువగా లేవు. కానీ ‘విశ్వం’ విషయం వేరు. గోపీచంద్ కి యాక్షన్ ఇమేజ్ ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్ వంటివి అమ్ముడు పోవాలంటే.. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండాలి. అందుకే దర్శకుడు శ్రీను వైట్ల… గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ ను గట్టిగా వాడుకోవాలని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. ‘విశ్వం’ లో చాలా యాక్షన్ సీక్వెన్స్..లు ఉంటాయట. ఈ క్రమంలో వయొలెన్స్ శృతిమించినట్టు తెలుస్తుంది. దసరా సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు కాబట్టి.. వారికి ఇబ్బంది కలగకుండా సెన్సార్ వారు కొన్ని సీన్లకు కత్తెర వేశారట. మరి ‘విశ్వం’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపిన సన్నివేశాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Viswam

1) సినిమాలో వచ్చే ‘తంగేడు’ అనే రెస్టారెంట్ పేరుని ‘ద్వారక’ గా మార్చారట.

2) ఓ సన్నివేశంలో ‘బద్దలు’ అనే పదాన్ని ఒళ్ళుగా.. వాయిస్ మార్పించారట.

3) హీరో గోపీచంద్, హీరోయిన్ కావ్య థాపర్..ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్లో.. గ్లామర్ షో శృతి మించడంతో..(ముఖ్యంగా క్లీవేజ్ షో) కొంచెం బ్లర్ చేశారట.

4) సినిమా స్టార్ట్ అయిన 1 గంట 13 నిమిషాలు 14 సెకన్ల వద్ద ఒక విలన్ చెయ్యి నరికే సీన్ ఉంటుందట. సో నరకబడిన చేతిని చూపించకుండా కొంచెం ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తుంది.

5) ఒక గన్ నుండి వచ్చే బుల్లెట్ ను.. సైడ్ షాట్ చేసి చూపించారట. ఒక గంట 15 నిమిషాల 22 సెకన్ల వద్ద ఈ సన్నివేశం వస్తుందట.

6) 1 గంట 16 సెకన్ల 50 సెకన్ల వద్ద మితిమీరిన వయొలెన్స్ కలిగిన సన్నివేశాలు వస్తాయట. వాటిని డిలీట్ చేశారట.

7) ఒక రౌడీ నుదిటికి కత్తి దిగిన సన్నివేశాన్ని కూడా డిలీట్ చేశారట.అలాగే ఇంకొన్ని బ్లర్ చేసినట్టు తెలుస్తుంది.

8) ఓ డెడ్ బాడీ విజువల్ ని కూడా డిలీట్ చేశారట. అదే సీన్లో వచ్చే ఇంకొన్ని విజువల్స్ ను డిలీట్ చేసినట్టు సమాచారం.

9) ట్రైన్ ఎపిసోడ్లో భాగంగా వచ్చే సన్నివేశాల్లో ‘రైల్వే’ అనే పదాన్ని కూడా మ్యూట్ చేసినట్టు సమాచారం. ఆ పదం వాడిన తీరు రైల్వే వారిని నొప్పించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

10) ఆడవాళ్ళ పై కమెడియన్ చెయ్యి చేసుకున్న విజువల్స్ ను కూడా డిలీట్ చేసి.. కెమెరా యాంగిల్స్ మార్చిన వాటిని రీప్లేస్ చేశారట.

11) డెడ్ బాడీ సన్నివేశాలు కొంచెం బ్లర్ చేసినట్టు స్పష్టమవుతోంది

12) హీరో విలన్..గ్యాంగ్ పై చేసే దాడిలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయట.

13) ప్రీ క్లైమాక్స్…లో వచ్చే ఒక 8సన్నివేశంలో మితిమీరిన రక్తపాతాన్ని సీజీతో కవర్ చేశారట.

14) క్లైమాక్స్ లో ఓ టెర్రరిస్ట్ వేళ్ళు కట్ చేసే సన్నివేశాన్ని డిలీట్ చేయకుండా.. ఆ విజువల్స్ ను కొన్నిటిని డిలీట్ చేయించారట.

వైరల్ అవుతున్న పవన్ హ్యాష్ ట్యాగ్.. దూరదృష్టి ఉన్న వ్యక్తంటూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus