Dhanush ,Aishwarya: ధనుష్ ఐశ్వర్య విచారణకు రాకపోవడం వెనుక కారణాలు ఇవేనా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు (Dhanush) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్ లో కుబేర అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ధనుష్ ఐశ్వర్య (Aishwarya)  గత కొన్నేళ్లుగా విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. చెన్నై ఫ్యామిలీ కోర్టు ధనుష్, ఐశ్వర్యలకు విడాకుల విషయంలో విచారణకు హాజరు కావాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. 2004 సంవత్సరంలో ధనుష్ ఐశ్వర్యల వివాహం జరగగా దాదాపుగా 18 సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవనం సాగించిన ఈ జోడీ మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Dhanush ,Aishwarya

ఈ దంపతులకు యాత్ర, లింగ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు. విడాకుల కోసం రెండేళ్ల క్రితమే ధనుష్, ఐశ్వర్య పిటిషన్లు దాఖలు చేయగా ఇప్పటివరకు వాళ్లు విచారణకు హాజరు కాలేదు. విడిపోవడం ఇష్టం లేక కోర్టుకు హాజరు కావడం లేదా? అనే ప్రశ్నకు విడిపోవడం ఇద్దరికీ ఇష్టమేనని కానీ వ్యక్తిగత కారణాల వల్ల, ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో అయినా ధనుష్, ఐశ్వర్య విడాకుల కోసం విచారణకు హాజరవుతారేమో చూడాలి. ధనుష్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. ధనుష్ కుబేర మూవీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో చూడాలి. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

నాగార్జున (Nagarjuna)  సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల వరుస విజయాలతో జోరుమీదుండగా కుబేర సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ధనుష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. కుబేర సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

మరో సౌత్ డైరెక్టర్ తో ఆమిర్ ఖాన్ మూవీ ఫిక్స్…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus