నిర్మాతగా మారిన మీనా
- May 20, 2016 / 02:07 PM ISTByFilmy Focus
బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, అగ్ర కథా నాయకులతో జోడీగా నటించి మెప్పించిన తార మీనా. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుని కొంత కాలం చిత్రాలకు దూరమైంది. మళ్లీ దృశ్యం, మామ మంచు అల్లుడు కంచు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు.
తమిళంలోనూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే మీనా ప్రస్తుతం నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సొంత బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదట తమిళంలో మూవీ తీయనుందని ఆమె సన్నిహిత వర్గాల వారు చెప్పారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














